వైఎస్ వివేకా హత్య కేసు(Ys Viveka Murder Case)లో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల రిమాండ్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు(CBI Court) పొడిస్తూ తీర్పునిచ్చింది. వివేకా హత్య కేసులో కస్టడీ ముగియడంతో నేడు వారిద్దర్నీ నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరపరిచారు. దీంతో సీబీఐ కోర్టు భాస్కర్ రెడ్డి(Bhaskar Reddy) రిమాండ్ ను ఏప్రిల్ 29వ తేది వరకూ పొడిగించింది. ఉదయ్ కుమార్ రెడ్డి(Bhaskar Reddy) రిమాండ్ ను ఏప్రిల్ 26వ తేది వరకూ పొడిగిస్తూ తీర్పునిచ్చింది.
కోర్టు తీర్పుతో భాస్కర్ రెడ్డి(Bhaskar Reddy), ఉదయ్ కుమార్ రెడ్డి(Bhaskar Reddy)లను సీబీఐ అధికారులు చంచల్ గూడ జైలుకు తీసుకెళ్లారు. వివేకా హత్య కేసు(Ys Viveka Murder Case)కు సంబంధించి విచారణలో కోర్టు సీరియస్ అయ్యింది. సుప్రీం కోర్టు జోక్యంతో విచారణను మరింత త్వరగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టింది.
వివేకా హత్య కేసు(Ys Viveka Murder Case)లో సాక్షాలను తారుమారు చేశారన్న అభియోగాలతో అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అవినాశ్ రెడ్డి(Avinash Reddy)కి కూడా 160 సీఆర్ పీసీ ప్రకారం నోటీసులు అందించారు. సీబీఐ(CBI) దర్యాప్తు గడువును సుప్రీంకోర్టు మరో రెండు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సీబీఐ విచారణ జూన్ 30వ తేది వరకూ కొనసాగనుంది.
మరోవైపు వివేకా హత్య కేసు(Ys Viveka Murder Case)లో కడప జిల్లా ఎస్పీగా ఉన్న ఐపీఎస్ అధికారి రాహుల్ దేవ్ శర్మను కూడా సీబీఐ(CBI) అధికారులు సోమవారం విచారించారు. వివేకా హత్య జరిగిన తర్వాత నియమించిన సిట్ బృందంలో రాహుల్ దేవ్ శర్మ కూడా ఉండటంతో సీబీఐ ఆయన్ని విచారించింది. వివేకా హత్య కేసుకు సంబంధించి రాహుల్ దేవ్ శర్మ నుంచి మరింత సమాచారాన్ని సీబీఐ సేకరించింది.