సినిమా తారలకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక పుకార్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. ముఖ్యంగా లవ్ ఎపైర్లకు సంబంధించిన వార్తలు అయితే కోకొల్లలు. తాజాగా రష్మిక మందాన(rashmika mandanna), హీరో బెల్లంకొండ శ్రీనివాస్(bellamkonda srinivas) ఇద్దరూ కలిసి కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. కాగా, ఈ రూమర్స్ పై బెల్లంకొండ స్పందించారు. దీంతోపాటు ఆయన సీరియస్ అయ్యారు.
గతంలో రష్మిక మందాన, విజయ్ దేవరకొండ తో రష్మికకు ఎఫైర్ ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకుంటారని తెగ వార్తలు వచ్చాయి. ఆ వార్తలను రష్మిక, విజయ్ దేవరకొండ ఏ రోజూ స్పందించలేదు. ఇప్పుడు తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్(bellamkonda srinivas)తో అంటూ రూమర్స్ వచ్చాయి. కాగా వీటిపై బెల్లంకొండ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.
ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో.. అర్థం కావడం లేదు. నేను రష్మికతో కలిసి రెండు సార్లు ఎయిర్పోర్ట్ లో కనిపించాను. అంతే అప్పటి నుంచి ఇలాంటి గాసిప్స్(rumours) పుట్టించారు. అయితే మా మధ్య ఏమీ లేదని శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. రష్మిక మందన్నతో తాను డేటింగ్ లో ఉన్నాను అన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు బెల్లంకొండ. నేను రష్మిక, మంచి స్నేహితులం.
అప్పుడప్పుడు కలిసినప్పుడు మాట్లాడుకుంటాము. షూటింగ్ పనిపై ముంబైకి వెళ్లినప్పుడు ఎయిర్ పోర్ట్(mumbai airport)లో కలుసుకుంటామని వెల్లడించారు. అంతేకాదు తాము అనుకోకుండా కలుసుకున్న సందర్భాలు కూడా తక్కువేనని పేర్కొన్నారు. అంతమాత్రానికే ఇలాంటి వార్తలు రాసేస్తారా? అని ప్రశ్నించారు. అవన్నీ పుకార్లేనని, వాటిని నమ్మవద్దని బెల్లంకొండ స్పష్టం చేశారు.
ఇక బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఇతను కూడా తరచూ ముంబై వెళ్ళి వస్తున్నాడు. రష్మిక(rashmika mandanna) సైతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తుండగా ముంబయికి ఎక్కువ సార్లు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో వీరు ఎయిర్ పోర్టులో కలిసి కనిపించినట్లు తెలుస్తోంది. మరి ఈ రూమర్స్ పై రష్మిక ఎలా స్పందిస్తారో చూడాలి.