»Konidela Niharika Is Trying To Forget Past Moments Her Comments
Niharika: ‘నిహారిక’ మరిచిపోయేందుకు గట్టిగా ట్రై చేస్తోందా!?
మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా.. మెగా బ్రాండ్‌తో నిహారిక(konidela Niharika)కి మంచి పాపులారిటీ ఉంది. అప్పట్లో ఏవో సిరీస్‌లు, షార్ట్స్ ఫిల్మ్స్ , సినిమాలు కూడా చేసింది. దాంతో నిహారికకు హీరోయిన్గా తెగ ఇంట్రెస్ట్ ఉందని అంతా అనుకున్నారు. కానీ మెగా అభిమానులు ఆమెను కాస్త వ్యతిరేకించారు. మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలున్నారు. కానీ నిహారిక హీరోయిన్ అనేసరికి.. కాస్త భయపడ్డారు. అయితే మళ్లీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతున్నట్టే కనిపిస్తోంది వ్యవహారం.
మెగా ఫ్యాన్స్ ఏదైతే అనుకున్నారో.. అందుకు తగ్గట్టే నిహారిక(konidela Niharika) సినిమాలకు దూరమైంది. పెళ్లి కూడా చేసుకుంది. కానీ ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నట్టు గత కొద్ది రోజులు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు మళ్లీ వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రి ఇవ్వబోతోంది. ‘డెడ్ పిక్సల్స్’ అనే వెబ్ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతోంది. అలాగే నిర్మాతగా కూడా సత్తా చాటాలని చూస్తోంది. పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ మూవీస్ నిర్మిస్తోంది.
ఇలాంటి సమయంలో తాజాగా నిహారిక చేసిన కొన్ని కామెంట్స్(comments) వైరల్‌గా మారాయి. 2020లో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది నిహారిక. ఉదయపూర్‌లో మెగా ఫ్యామిలీ సమక్షంలో అంగరంగా వైభవంగా పెళ్లి జరిగింది. రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఈ పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత నిహారిక, చైతన్య కొన్ని రోజులు హ్యాపిగా ఉన్నారు.
కానీ ఈ మధ్యలో నిహారిక విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. బయటికి చెప్పకపోయినా నిహారిక, చైతన్య నుంచి విడిపోయిందంటూ గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తన సోషల్ మీడియా ఖాతాల్లో నిహారిక, చైతన్య ఒకరినొకరు అన్‌ఫాలో అయ్యారు. రీసెంట్గా నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌లో తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలన్నీ డిలీట్ చేసింది. దీంతో విడాకుల విషయంలో జనాలు ఓ క్లారిటీకి వచ్చారు. ఇలాంటి సమయంలో నిహారిక చేసిన కామెంట్స్ మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి.
తాజాగా జిమ్ వర్కౌట్‌కు సంబంధించిన వీడియోని ఇన్‌స్టా(instagram)లో షేర్ చేసింది నిహారిక. ఆ వీడియో పై కొన్ని కామెంట్స్ రాసుకొచ్చింది. అన్ని గాయాలకు కాలమే మందు.. నువ్వు ఊహించిన దానికంటే, నువ్వే ఎక్కువ బలవంతురాలివి.. అంటూ రాసుకొచ్చింది. దీంతో విడాకుల నుండి బయటపడేందుకు.. భర్తను మరిచిపోయేందుకే నిహారిక ఇలా చేస్తోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి నిహారిక డివోర్స్ మ్యాటర్ ఎప్పుడు తేలుతుందో చూడాలి.