PDPL: కలెక్టరేట్ కార్యాలయంలో యూరియా, యాసంగి నీటి సరఫరాపై కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. 8 ఏప్రిల్ 2026 వరకు 7 తడులలో ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదలవుతుందని జగిత్యాల జిల్లాకు 7 రోజులు, పెద్దపల్లి జిల్లాకు 8 రోజులపాటు సాగునీరు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. చివరి ఆయకట్టుకు నీరు అందేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలన్నారు.