MNCL: శ్రీరాంపూర్ ఏరియాలోని వివిధ గనుల్లో ఐదేళ్ళ లోపు సర్వీస్ ఉన్న జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లకు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అంశంపై శిక్షణ శిబిరాన్ని జీఎం శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. సింగరేణిలో రక్షణతో కూడిన ఉత్పత్తి సాధనే ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి ఉద్యోగి రక్షణ సూత్రాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.