కృష్ణా: పెద్ద అవుటుపల్లి గ్రామ పంచాయతీలో వికసిత్ భారత్ జీ రామ్ జీ, స్వచ్ఛ సంక్రాంతి–స్వచ్ఛ పంచాయతీ 2026 కార్యక్రమాలపై గ్రామ సభ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు 100 నుంచి 125 రోజులకు పెంచిన పని దినాలు గురించి ప్రజలకు వివరించారు. అలాగే ఉంగుటూరులో వికసిత్ భారత్ జీ రామ్ జీ పేరు మార్పులు, స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమాలు నిర్వహించారు.