తిరుపతి: సంక్రాంతి సందర్భంగా తిరుపతికి వెళ్లే ప్రయాణ ఛార్జీలు భారీగా పెరిగాయి. HYD-TPT మధ్య స్లీపర్ బస్సు ధరలు సాధారణంగా రూ.1,000-1,500 ఉండగా, పండుగ రోజుల్లో రూ.2,000కు పైగా, కొన్నిచోట్ల రూ.5,000 వరకు చేరాయి. అదే మార్గంలో విమాన టికెట్లు కూడా రూ.3,700-4,500 నుంచి రూ.8,000-10,000కు పెరగడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.