SRPT: జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ సూర్యాపేటలో కోర్టు ఆవరణలో ‘సురక్ష అభియాన్’ ర్యాలీ నిర్వహించారు. కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ నేతృత్వంలో న్యాయమూర్తులు, విద్యార్థులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనం నడపరాదని ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో జడ్జీలు రజిత, అపూర్వ రవళి, మమత, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.