మెగా ప్రిన్సెస్ నిహారిక(Niharika) విడాకులు తీసుకుంది అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఎంత మంది ఎన్ని కామెంట్స్ చేసినా ఎవరూ స్పందించకపోగా, తాజాగా నిహారిక, ఆమె భర్త చైతన్య ఇద్దరూ విడాకులపై అధికారికంగా ప్రకటించారు. 2020 డిసెంబరులో నిహారిక, టెక్ అఫిషియల్ చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. ఉదయ్‌పుర్ వేదికగా జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ వైభవంగా జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. కానీ, పెళ్లైన కొంత కాలానికే వీరు విడాకుల బాట పట్టడం గమనార్హం.
వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, వారి ఫోటోలను, ముఖ్యంగా ఫోటోలను డిలీట్ చేయడంతో, వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయనే వార్తలు వచ్చాయి.వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, అధికారికంగా మాత్రం ఇటీవల ప్రకటించారు. వీరిద్దరూ మ్యూచువల్ గా ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్నారు. నిన్న నే వారిద్దరికీ విడాకులు వచ్చేశాయి. దీంతో, వీరిద్దరూ ఒకేసారి తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు.
అయితే, వీరిద్దరి విడాకులకు కారణం ఏంటి అని చాలా మంది ఆరాతీయడం మొదలుపెట్టారు. అయితే, వారిద్దరి మధ్య మనస్పర్థతలు రావడమే కారణం అని తెలుస్తోంది. ఇకపోతే పెళ్లి తర్వాత నిహారిక చుట్టూ ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఓసారి పబ్ పార్టీ డ్రగ్స్ విషయంలో ఆమె పేరు బాగా చర్చనీయాశంమైంది. ఆ తర్వాత ఓ సారి వారు ఉంటున్న అపార్ట్మెంట్ వాళ్లతో గొడవ జరిగిందంటూ మరో వివాదం బయటకు వచ్చి స్టేషన్ వరకు వెళ్లింది. ఇవి కూడా విడాకులకు దారితీశాయని తెలుస్తోంది. ఇక ఆరు నెలల క్రితమే కూకట్పల్లి కోర్టులో మీరు విడాకులకు పిటిషన్ దాఖలు చేశారు. అందుకు సంబంధించిన అప్లికేషన్ ఫోటో కూడా నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసింది. ముందు చైతన్యనే విడాకులకు ధరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే నిహారిక కూడా విడాకులకు అప్లై చేసిందట.