ప్రముఖ నటుడు శరత్ బాబు(Sarath Babu) మరణించారనే వార్తలపై అతని సోదరి స్పందించారు. ప్రస్తుతం చనిపోలేదని, హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారని తెలిపింది.
త్వరలోనే ఆయన కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసింది. కొంచె రికవరీ అయిన నేపథ్యంలో రూమ్ షిఫ్ట్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో శరత్ బాబు చనిపోయారనే వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని వెల్లడించారు.