»Actor Kamal Haasan Mistake On Sarath Babu News Tweeted And Later Deleted
Sarath Babuపై తప్పుడు వార్తలకు పొరబడిన కమల్ హాసన్.. ట్వీట్ చేసి తర్వాత డిలీట్
ఆస్పత్రి వైద్యులు, శరత్ బాబు కుటుంబసభ్యులు స్పష్టత ఇవ్వడంతో ఆయా వార్తలు ప్రసారం చేసిన వారు డిలీట్ చేయడం.. లేదా సవరించడం చేశారు. అయితే అసత్య వార్తలను కొందరు ప్రముఖులు కూడా నమ్మారు. శరత్ బాబుకు సంతాపం అని ప్రకటనలు కూడా చేశారు.
కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు శరత్ బాబు (Sarath Babu) ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే అనూహ్యంగా బుధవారం సాయంత్రం ఆయన మరణించారనే వార్తలు కలకలం రేపాయి. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే మృతి చెందారనే అసత్య వార్తలు (Fake News) సోషల్ మీడియాలో వచ్చాయి. కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి. అయితే ఆస్పత్రి వైద్యులు, శరత్ బాబు కుటుంబసభ్యులు (Family) స్పష్టత ఇవ్వడంతో ఆయా వార్తలు ప్రసారం చేసిన వారు డిలీట్ చేయడం.. లేదా సవరించడం చేశారు. అయితే అసత్య వార్తలను కొందరు ప్రముఖులు కూడా నమ్మారు. శరత్ బాబుకు సంతాపం అని ప్రకటనలు కూడా చేశారు. అలా చేసిన వారిలో దిగ్గజ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) కూడా ఉన్నారు. ఆ వార్తలను నమ్మి కమల్ ట్వీట్ (Tweet) చేశాడు. అయితే తప్పు తెలుసుకుని ట్వీట్ డిలీట్ (Delete) చేశారు.
తెలుగు, తమిళ్ తో పాటు మరికొన్ని భాషల్లో అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన నటుడు శరత్ బాబు. ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad) గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం కిందట బెంగళూరు నుంచి అతడిని హైదరాబాద్ కు తరలించారు. అప్పుడే ఆయన ఆరోగ్యం విషమించిందనే వార్తలు (Health Condition) వచ్చాయి. బుధవారం ఒక్కసారిగా ఆయన మరణించారని వచ్చాయి. ముఖ్యంగా తమిళ ప్రధాన మీడియా సంస్థలు కూడా ఇదే ప్రసారం చేశాయి. వాటిని నమ్మిన కమల్ హాసన్ శరత్ బాబు మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశాడు.
అయితే ఆ వార్తలు తప్పని కొన్ని నిమిషాల తర్వాత తెలిసింది. వెంటనే ఆ ట్వీట్ ను కమల్ డిలీట్ చేశారు. కాకపోతే అప్పటికే కొందరు స్క్రీన్ షాట్లు తీసుకున్నారు. ‘నా ప్రియమైన పెద్దన్నయ్య శరత్ బాబు నాకు మంచి దోస్త్. మంచి మనసున్న మనిషి. ఆయనను కోల్పోవడం దురదృష్టకరం’ అని ట్వీట్ చేశారు. అప్పటికే 17 వేల మంది చూశారు.. 160 మంది రీట్వీట్ లు, 652 లైక్ లు చేశారు. కాగా, శరత్ బాబు ఆరోగ్యంపై ఆయన సోదరుడి కుమారుడు ఆయుశ్ తేజస్ (Ayush Tejas) స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ‘శరత్ బాబు ఆరోగ్యం నిలకడగా (Stable) ఉంది. మునుపటి కంటే ఇప్పుడు కొంచెం కోలుకుంటున్నారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం (Time) పడుతుంది. ఆయన చనిపోయారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అభిమానులు, ప్రజలకు విన్నవిస్తున్నా. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న వారందరికీ ధన్యవాదాలు’ అని ఆయుశ్ తేజస్ తెలిపారు.