WGL: ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామంలో యాసంగి వరి, మొక్కజొన్న పంటలకు యూరియా అత్యవసరమవడంతో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రైతులు, మహిళా రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఉదయం నుంచే టోకెన్ల కోసం వేచి ఉన్న రైతులు, యూరియా సరఫరా వెంటనే చేపట్టాలని అధికారులను కోరారు. ఎరువుల కొరత వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.