ఛత్తీస్గ్ఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో రెండు 12-బోర్ తుపాకులు, పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.