MNCL: రామకృష్ణాపూర్ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. బీ జోన్‌లోని శ్రీనివాస నగర్‌కు చెందిన కుశనపల్లి నవీన్ బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ప్రైవేట్ పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు ఎస్సై రాజశేఖర్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.