NTR: తిరుమలగిరి గ్రామానికి చెందిన ఒక్క గృహిణికి నిన్న రాత్రి +918423958177 నెంబర్ నుండి ఎవరో గుర్తు తెలియని కాల్స్ వచ్చాయని ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా చిల్లకల్లు ఎస్ఐ శ్రీనివాస్ ఆ నంబర్‌ను బ్లాక్ చేయించారు. ఎస్ఐ మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.