30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృథ్వీరాజ్(Prithviraj) అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. అయితే అతను ఆస్పత్రి బెడ్ పై ఉన్న చిత్రం కాస్తా ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతుంది.
టాలీవుడ్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు కమెడియన్ పృథ్వీరాజ్(Prithviraj). ఈ క్రమంలో ఆయన తాజాగా తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్న ఆయన… సడన్ గా ఆసుపత్రి బెడ్డు పైన కనిపించడం చూసి అభిమానులు షాక్ కి గురవుతున్నారు.
అయితే పృథ్వీరాజ్ అనారోగ్యానికి గల కారణమేంటనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ తాజాగా ఒక వీడియోని మాత్రం విడుదల చేయడం జరిగింది పృథ్వీరాజ్. మొదటిసారి తాను తీయబోతున్న కొత్త రంగుల ప్రపంచం సినిమాకి ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని తెలియజేస్తున్నారు.
ఈనెల 26వ తేదీన ఈ సినిమాకు సంబంధించి ఒక ఈవెంట్ చేయబోతున్నామంటూ సెలైన్ తో ఉన్న ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నానంటూ తెలియజేస్తున్నారు పృథ్విరాజ్. అయితే తన అనారోగ్యానికి కారణమేంటో మాత్రం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. తీవ్ర అలసట వల్లే ఈయన ఆసుపత్రి(hospital) పాలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నటుడు ఇప్పటికే విలన్, కమెడియన్ సహా పలు క్యారెక్టర్లలో నటించారు. అంతేకాదు టాలీవుడ్లో పృథ్వీకి స్పెషల్ గుర్తింపు కూడా ఉంది. ఖడ్గం మూవీలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో ఫుల్ ఫేమస్ అయ్యాడు. మరోవైపు ఈ నటుడు ఏపీ రాజకీయాల్లో కూడా పనిచేస్తున్నారు. గతంలో వైసీపీ పార్టీలో ఉండగా..పలు కారణాలతో జనసేన పార్టీలో చేరి ప్రస్తుతం కొనసాగుతున్నారు.