China Landslide: కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి
కొండచరియలు విరిగి పడటంతో 19 మంది మృతిచెందిన ఘటన చైనాలో ఆదివారం చోటుచేసుకుంది. విరిగిపడ్డ కొండ చరియల ప్రాంతంలో 40 వేల మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని సురక్షితంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
చైనా(China)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో అక్కడికక్కడే 19 మంది దుర్మరణం(19 Died) చెందారు. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో జిన్‌కౌహీ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. ఆదివారం ఈ ప్రమాదం జరిగిందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన చోట సుమారు 40 వేల మంది వరకు ప్రజలు ఉంటున్నట్లు సమాచారం.
గత రెండు రోజులుగా చైనా(China)లోని ఈ ప్రాంతంలో భారీ వర్షాలు(Heavy Rain) కురుస్తున్నాయి. వర్షాల తీవ్రత వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే 180 మందితో కూడిన సహాయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ ఘటనలో 19 మంది మృతి(19 Died) చెందగా వీరందరూ కూడా ఓ మైనింగ్ కంపెనీలో పనిచేస్తున్నవారేనని తెలుస్తోంది. మిగిలిన వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.