E.G: రాజమండ్రిలోని జాంపేటలో గురువారం జరిగిన శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి మహోత్సవ వేడుకలకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలు.. సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని వేడుకున్నారు.