BPT: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం “హరహర వీరమల్లు” గురువారం విడుదల కావడంతో బాపట్లలోని శ్రీనివాస థియేటర్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. బాపట్ల జనసేన పార్టీ నాయకుడు విన్నకోట సురేష్ ఆధ్వర్యంలో థియేటర్ పరిసరాలన్నీ పవన్ కళ్యాణ్ జెండాలతో రెపరెపలాడాయి. ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర ఫ్యాన్స్‌తో కలిసి వీక్షించారు.