E.G: పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై రాజమండ్రి ఎంహెచ్ఓ డాక్టర్ వినూత్న గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక 17, 32వ వార్డులోని జాంపేట పూల మార్కెట్ ప్రాంతంలో ఆమె పర్యటించారు. ఈ మేరకు వ్యాపారుల వద్ద ప్లాస్టిక్ వాడకాన్ని పరిశీలించడమే కాకుండా, ప్రత్యామ్నాయంగా వాడవలసిన పర్యావరణహిత బ్యాగులపై పలు సూచనలు ఇచ్చారు.