ATP: ఎమ్మెల్యే భాను ప్రకాశ్.. మాజీ మంత్రి రోజాను కించపరిచేలా మాట్లాడటం దారుణమని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి మండిపడ్డారు. గుత్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజకీయాల్లో వ్యక్తిగతంగా మహిళలపై దూషణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని ఆమె సూచించారు.