కడప: మైదుకూరు పట్టణంలోని పాత సాయిబాబా గుడి నుంచి మార్కెట్కు వెళ్లే రోడ్డు వర్షం వస్తే చెరువును తలపిస్తుందని స్థానికులు పేర్కొన్నారు. చిన్నపాటి వర్షానికి వర్షపు నీరు నిలబడంతో దోమలు వ్యాప్తి చెంది రోగాల భారిన పడుతున్నామన్నారు. రోడ్డుపై నీరు నిలబడటం వల్ల కళాశాలకు వెళ్లే విద్యార్థులు సైతం నడవడానికి ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.