పొలిటికల్ ఎంట్రీపై తమిళ నటుడు విజయ్ ఆంటోని మరోసారి స్పందించాడు. ‘భద్రకాళి’ సినిమా ప్రమోషన్స్‌లో విజయ్‌కు.. ‘మీరు రాజకీయాల్లోకి వస్తారా’ అనే ప్రశ్న ఎదురైంది. దానికి.. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని బదులిచ్చాడు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకోవడం లేదని పేర్కొన్నాడు. తన ఫోకస్ మొత్తం సినిమాలు, మ్యూజిక్‌పై ఉందని స్పష్టం చేశాడు.