E.G: గ్రంథాలయ ఉద్యమానికి ఊపిరి పోసి, గ్రంథాలయాల పురోభివృద్ధికి విశేష కృషి చేసిన గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకట రమణయ్య అని రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు కోట రామ ప్రసాద్ అన్నారు. గురువారం ఉండ్రాజవరం శాఖా గ్రంథాలయంలో అయ్యంకి వెంకట రమణయ్య 135వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకెళ్ళ శ్రీనివాసరావు పాల్గొన్నారు.