WGL: ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. MLG జిల్లాల్లోని మల్లూరు, శ్రీనగర్ గ్రామాల్లో పలు కాలనీలు జలమయమయ్యాయి. వెంకటాపురం(M) యాకన్నగూడెం వద్ద రోడ్డు కోతకు గురైంది. MHBD జిల్లాలో చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. పాకాల ఏరు, జంపనన్నవాగు ఉప్పొంగడంతో మద్దివంచ-రాంపురం, పడిగాపూర్-నార్లాపూర్ రాకపోకలు నిలిచిపోయాయి.