»10 People From The Same Family Died In A Terrible Road Accident
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది దుర్మరణం
బళ్లారి నుంచి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మైసూరు సందర్శనకు వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని ఓ ప్రైవేటు బస్సు ఢీకొంది. 10 మంది సంఘటనా స్థలంలోనే దుర్మరణం(10 Died) చెందారు.
కర్ణాటక(Karnataka)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మైసూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది దుర్మరణం(10 Died) చెందారు. ఓ ప్రైవేటు బస్సు, కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతిచెందిన వారిలో ఇద్దరు చిన్నారులు(2 Childrens) కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తిరుమకుడాలు, నరసిపురా మార్గం మధ్య ఈ రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగినట్లు పోలీసులు తెలిపారు. బళ్లారి నుంచి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మైసూరు సందర్శనకు వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని ఓ ప్రైవేటు బస్సు ఢీకొంది. అతి వేగంగా రావడం వల్ల ఇన్నోవా వాహనం నుజ్జునుజ్జయింది. 10 మంది సంఘటనా స్థలంలోనే దుర్మరణం(10 Died) చెందారు. అతికష్టంమ్మీద మరికొందరిని బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.