AP: తిరుపతి జిల్లా చిల్లకూరు హైవేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటెయినర్ లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందారు. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అరుణాచలం దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మృతులు నెల్లూరు వనంతోపుకు చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.