NLR : కోవూరు మండలం పడుగుపాడు రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొట్టడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు సుమారు 70 సంవత్సరాల వయసు కలిగి, తెల్లని నిండు చేతుల చొక్కా, కాఫీ కలర్ చెక్స్ లుంగీ ధరించి ఉన్నాడు. చొక్కా కాలర్‌పై మ్యాక్స్ టైలర్స్ కోవూరు లేబుల్ ఉంది. మృతుడు ఎవరు అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.