VSP: భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభం మండలం కురపల్లి గ్రామంలో ఓ ప్రైవేటు రిసార్ట్లో స్విమ్మింగ్ ఫుల్లో మృతదేహం కలకలం రేపింది. గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్నేహితుల పుట్టిన రోజు వేడుకలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. మద్యం తాగి స్విమ్మింగ్ ఫుల్ దిగి అభిషేక్ వంశీ (24)మృతి చెందినట్టు ప్రాథమిక నిర్థారణకు పోలీసులు వచ్చారు.