AP: ఆస్తికొసం ఓ తల్లి కన్న కొడుకును హత్య చేయించిన ఘటన పల్నాడు జిల్లా క్రోసూరు మండలం హసనాబాద్లో చోటుచేసుకుంది. గత కొంతకాలంగా తల్లి, కొడుకు మధ్య ఆస్తి వివాదం కొనసాగుతోంది. దీంతో మహబూబ్ బాషా(28)పై తన తల్లి మున్నీబీ దాడి చేయించింది. తీవ్రంగా గాయపడ్డ యువకుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చేందాడు. ‘తల్లి, కుమారుడి మధ్య ఉన్న ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాం.’ అని సత్తెనపల్లి డీఎస్పీ తెలిపారు.