MHBD: తొర్రూరు మండలం జమస్థాపురం రూపతండాలో శనివారం విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. రైతు భూక్య రవి పొలంలో ఎద్దులను మేపుతుండగా, ఒక ఎద్దు ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. జీవనాధా
NDL: ఓర్వకల్లు మండలం శకునాలకు చెందిన శీలం మాధవి (45) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఎస్సై సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, భర్త శీలం చిన్నరాజు మద్యానికి బానిసై, పనికి వెళ్లకుండా ఉండటంతో తీవ్ర మనోవేదనకు గురైన భార్య ఆత్మహత్యాయత్న
HNK: జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం రాత్రి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈనెల 27న జరగనున్న పార్టీ రజతోత్సవ వేడుకల సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన మహాసభన
కృష్ణా: గుడివాడలో వ్యభిచార గృహంపై రూరల్ పోలీసులు దాడి చేశారు. తాలూకా పోలీసే స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహం నడుస్తోందన్న సమాచారం మేరకు రూరల్ ఎస్సై ఎన్.చంటిబాబు సిబ్బందితో దాడి చేశారు. ఇంటి యజమాని యలవర్తి లక్ష్మీ, జోసెఫ్, ఇద్దరు విటులను అదుపుల
NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారికి పౌర్ణమి పూజలను శనివారం వైభవంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఉత్సవ మూర్తికి ప్రత్యేక అలంకరణ చేసి పల్లకి సేవను చేశారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఉన్న యాగశాల నందు చండీ హోమాన్న
BDK: టేకులపల్లి మండలం బొమ్మనపల్లి మండల పరిషత్ పాఠశాలలో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. వంటగదిలో వంట మనిషి సరోజ వంట చేస్తుండగా, స్లాబ్ పెచ్చులు ఊడిపడటంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనను గమనించిన పాఠశాల సిబ్బంది ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించా
MNCL: కన్నెపల్లి మండలం రెబ్బల గ్రామ శివారులో సర్వే నెంబర్ 248లో గల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు SI గంగారం శనివారం తెలిపారు. మండల MRO ఫిర్యాదు మేరకు చేసిన విచారణలో అక్రమంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రోడ్లు ఇతర అభివృద్ధి పనులకు అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదర్శించారు. హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉ
WGL: పర్వతగిరి మండలం గుడిబండ తండాలో ఇటీవల భూక్య రంగమ్మ (65) ఇటీవల తల్లిని పెద్ద కుమారుడు భూక్య రవి కొట్టడంతో ఆమె మృతి చెందిన విషయంపై శనివారం నిందితుడు రవిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.
TPT: ఈనెల 14వ తేదీ సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, జిల్లా కేంద్రానికి, రెవె