SRCL: ఉత్తమ రక్తదాత అవార్డును సిరిసిల్లకు చెందిన రాజిరెడ్డి అందుకున్నారు. ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా కామారెడ్డిలో ఉత్తమ రక్తదాత అవార్డును జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. రక్తదానం వలన మరొకరి ప్రాణాలను రక్షించడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చని వివరించారు.