AKP: నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామానికి చెందిన దేవాడ దీపక్ అనే యువకుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పరీక్షలలో జాతీయ స్థాయిలో 105వ ర్యాంకు సాధించాడు. ఎన్ఐటి అగర్తలాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన దీపక్ సివిల్ సర్వీస్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారు. అతనిని కేంద్ర బలగాలలో అసిస్టెంట్ కమాండెంట్‌గా నియమిస్తారు.