SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన గోశాలలో సిబ్బంది నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ పోస్టులకు దాదాపు 250 మంది దరఖాస్తు చేసుకోగా, శనివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇంటర్వ్యూలు కలెక్టర్ సందీప్ కుమార్, ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్ అధికారులు కలిసి నిర్వహించారు. 40 మందికి నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు.