KNR: మంత్రి పదవి వచ్చినట్టే వచ్చి చేజారడంతో కవ్వంపల్లి వర్గీయులు నిరుత్సాహంలో మునిగిపోయారు. కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి ఖరారైనట్లు నిన్నటి నుంచి ప్రచారం జోరందుకుని.. నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు జోష్లో తేలియాడుతున్న చివరి క్షణంలో మంత్రి పదవి చేజారడంతో కవ్వంపల్లి వర్గీయులు నిరుత్సాహంలో ఉన్నట్టు సమాచారం.