SRPT: ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం సూర్యాపేటలోని బీసీ కార్యాలయం ధర్మభిక్షం భవన్లో సూర్యాపేట బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. యువతకు జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యాలని అన్నారు.