MBNR: మంత్రి వాకిటి శ్రీహరిని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్ జిల్లా నుంచి మంత్రి కావడంతో జిల్లా మరింత అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుందన్నారు. అలాగే దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలన్నారు.