RR: తలకొండపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అజయ్ అనే విద్యార్థి సబ్ జూనియర్ U16 వాలీబాల్ గేమ్స్‌లో జాతీయస్థాయికి సెలెక్ట్ అయినట్లు పీడీ పాండు తెలిపారు. వారం రోజుల నుంచి నిజామాబాద్ జిల్లాలోని నేషనల్ క్యాంపులో అజయ్ పాల్గొని ఉత్తమ ప్రదర్
NGKL: శ్రీశైలం ఘాట్ రోడ్డులోని వటవర్లపల్లి గ్రామ శివారులో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, మినీ ట్రావెల్స్ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు గాయపడగా, లక్ష్మయ్య అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక
MDK: తూప్రాన్ పట్టణంలో APకి చెందిన మధుసూదన్ (32) శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. చేగుంట మండలంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న అతను తూప్రాన్ పట్టణంలో అద్దెకు ఉంటున్నాడు. నిన్న కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేయకపోవడంతో తెలిసిన వాళ్లక
PDPL: జాతీయ మానవ హక్కుల కమిటీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం ఆవిష్కరించారు. జిల్లా మానవ హక్కుల కమిటీ జిల్లా ప్రతినిధులు సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజల, కార్మికుల హక్కులకు ఎక్కడ భంగం కలగకు
NDL: గ్రామ పంచాయతీలు సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవాలని ఎంపీడీవో మేరీ సూచించారు. శుక్రవారం కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళిక శిక్షణ నిర్వహించారు. గ్రామాల్లో ఆస్తి, ఇతర పన్నుల ద్వారా ఆదాయం సృ
TPT: రేణిగుంట పట్టణంలో ఎంటీఆర్ సర్కిల్ వద్ద శుక్రవారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహించారు. సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో SI ధర్మారెడ్డి, ఆర్టీవో శ్రీనివాసరావు, సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. అధిక కాంతి వెలువరించే LED బల్బులు అమర్చిన వాహనాలను
అల్లూరి: స్వయం సహాయక సంఘాల గిరిజన మహిళలు, హస్తకళల వస్తువులను విక్రయించే మహిళలకు వచ్చేనెల 9,10వ తేదీల్లో ఆధునిక 3D ప్రింటింగ్ సాంకేతికతపై రెండు రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ పీవో శ్రీపూజ తెలిపారు. పాడేరు కాఫీ హౌస్‌లో జరిగే శిక్షణకు 10వ తరగ
NZB: కమ్మర్‌పల్లిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హిందూ జన జాగృతి సమితి ఆధ్వర్యంలో ‘హిందూ రాష్ట్ర జాగృతి సభ’ శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర సమన్వయకర్త చైతన్య గాడి, శ్రీమతి తేజస్వి వెంకటాపూర్ ప్రసంగిస్తూ.. హిందూ ధర్
అన్నమయ్య: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే స
సత్యసాయి: గోరంట్ల మండలంలోని కరవులపల్లి తండా వద్ద శ్రీరామనవమి పురస్కరించుకుని మార్చి 28న జిల్లాస్థాయి ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించనున్నారు. అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ పోటీలు జరుగుతాయి. విజేతలకు రూ. లక్ష ప్రథమ బహుమతి అందజేస్తారు. ఆసక్తి