ELR: నరసాపురం గ్రంథాలయంలో విద్యార్థుల కోసం వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు లైబ్రేరియన్ కుమారి తెలిపారు. ఈ నెల 28 నుంచి జూన్ 6 వరకు ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 11 గం. వరకు ఈ శిబిరం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
TPT: తిరుపతి శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. శ్రీ కళాసమితి కూచిపూడి డాన్స్ & మ్యూజిక్ అకాడమీకి చెందిన కళాకారులు ఆకట్టుకునే ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్శకులు మంత్రముగ్ధులై కళాకారులను అభినందించారు. అనంతరం వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
నెల్లూరులోని సరస్వతి నగర్‌కు చెందిన జాను మద్యానికి బానిసయ్యాడు. అన్నం తినకుండా ఎక్కువగా మద్యం తాగుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఎఫ్‌సీఐ కాలనీ సెంటర్ వద్ద పడిపోయి మరణించాడని మృతుడి చెల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. మృతుని భార్య సౌదీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
GNTR: రాబోయే ఎన్నికల్లో 100% విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమా పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్ ఇంఛార్జ్‌ల శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ పటిష్ఠతకు శక్తివంచన లేకుండా ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలన్నారు.
KRNL: ఆదోనిలో SERP ఆధ్వర్యంలో శనివారం VOAలకు స్మార్ట్ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, MLA పార్థసారధి, టీడీపీ నేత దేవేంద్రప్ప ముఖ్య అతిథులుగా పాల్గొని ఫోన్లు అందజేశారు. స్మార్ట్ఫోన్లతో సేవలు వేగవంతమై పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
KRNL: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఇవాళ బీఎస్పీ నేత గాడి అరుణ్ కుమార్ ఆరోపించారు. పలుచోట్ల బంకుల్లో “నో స్టాక్” బోర్డులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్న బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధిక ధరలకు విక్రయిస్తే బంకులను సీజ్ చేయాలని అధికారులను కోరారు.
NDL: నంద్యాల మండలం మూలసాగరం పరిధిలో ఆక్రమణలో ఉన్న శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానం భూమిని స్వాధీనం చేసుకున్నట్లు శనివారం ఆలయ ఈవో శ్రీనివాస రెడ్డి తెలిపారు. సర్వే నంబర్ 974/1లోని 5-68 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని చెప్పారు. దీంతో రికార్డుల ప్రకారం స్వాధీనం చేసుకున్నామన్నారు. సర్వే చేయించి సంబంధిత భూమిని లీజుకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
సత్యసాయి: జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి చమురు సంస్థల ప్రతినిధులు, పౌరసరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వినియోగదారులకు గ్యాస్ కొరత లేకుండా లోడ్లను పెంచాలని ఆదేశించారు.
అన్నమయ్య: మదనపల్లిలో రహదారి భద్రతపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రమాదాల నివారణకు 232 కీలక ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 50 చోట్ల పనులు పూర్తయ్యాయని, మిగిలిన ప్రదేశాల్లో వేగంగా పూర్తి చేయాలని సూచించారు.జిల్లాలో 19 బ్లాక్ స్పాట్లను గుర్తించి, వాటిలో 14 చోట్ల భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ELR: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి ప్రజలకు అండగా నిలవాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. శనివారం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే వాటిని పరిశీలించారు. అలాగే సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
TPT: తిరుపతి జిల్లాలో జలధార–జలహారతి పథకం కింద చేపడుతున్న పనులతో పుత్తూరు మండలంలో నీటి సంరక్షణకు ఊతమిస్తోంది. కాలువల పూడికతీత, చెరువుల పునరుద్ధరణతో సుమారు 300 ఎకరాల గిరిజన భూములకు సాగునీరు అందే పరిస్థితి ఏర్పడుతోంది. ఉపాధి హామీ కింద గిరిజనులకు రోజుకు రూ.300 వేతనం లభిస్తూ ఆదాయం కలుగుతోంది. ఈ పనులతో నీటి వనరులు పెరిగి రైతులకు లాభం చేకూరుతుందన్నారు.
KDP: రాబోయే వర్షా కాలంలో బద్వేల్లో నీటి నిల్వలు, మురుగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలకు మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సూచనల మేరకు పట్టణంలోని ప్రధాన కాలువలు శుభ్రపరిచే పనులను మున్సిపల్ సిబ్బంది శనివారం ప్రారంభించారు. కాలువల్లో పూడికను తొలగించి వర్షపునీరు సజావుగా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కోనసీమ: ధాన్యం సేకరణలో జాప్యం జరిగినా, రైతుల నుంచి ఫిర్యాదులు అందినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ నిధియాదేవి హెచ్చరించారు. శనివారం ఆమె ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి-1 రైతు సేవా కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తేమ శాతం పరికరాల ద్వారా పరిశీలించి రికార్డులు సమీక్షించారు.
PLD: జిల్లాలో ప్రకృతి సేద్యంపై అవగాహన పెంపు అవసరమని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కే. అమల కుమారి పేర్కొన్నారు. శనివారం నరసరావుపేటలో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. 2026–27 నాటికి 82,595 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ కోసం విత్తన కిట్లు అందుబాటులో ఉంచినట్టు చెప్పారు.
NTR: జిల్లాలో నీటి భద్రత సాధనకు జలధార-జలహారతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో శనివారం ఆయన మాట్లాడారు. నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా గౌరవ సీఎం దార్శనికతకు అనుగుణంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 100 రోజుల ప్రత్యేక కార్యాచరణగా చేపడుతు...