• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వైకుంఠ నారాయణుడికి పంచామృత అభిషేకాలు

VZM: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం శ్రీ రామనారాయణంలో ఆదివారం శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ నారాయణ స్వామి వారికి పంచామృత అభిషేకాలు జరిపారు. ఆలయ అర్చకులు చాణక్య, హర్ష, కృష్ణ తేజ ఆధ్వర్యంలో విశిష్ట పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగార్జునరావు, భక్తులు పాల్గొన్నారు.

April 12, 2026 / 03:30 PM IST

‘అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు చేపట్టాలి’

కర్నూలు: ఐపీఎల్ బెట్టింగ్, మట్కా, జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు చేపట్టాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం జిల్లా ఎస్పీ జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణపై ముఖ్య సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో జూద కార్యకలాపాలు కట్టడి చేయాలన్నారు.

April 12, 2026 / 03:28 PM IST

అంబేద్కర్ విగ్రహన్ని ఆవిష్కరించిన ఎంపి, ఎమ్మెల్యే

ప్రకాశం: ఒంగోలు కేశవరాజుకుంటలోని చెన్నకేశవస్వామి కాలనీలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, హుడా ఛైర్మన్ షేక్ రియాజ్ హాజరై, విగ్రహాన్ని ఆవిష్కరించారు.

April 12, 2026 / 03:27 PM IST

ఘనంగా ర్యాలి జగన్మోహిని కేశవ స్వామి కళ్యాణం

కోనసీమ: ర్యాలి శ్రీ జగన్మోహిని కేశవ & గోపాల స్వామి దేవస్థానంలో శ్రవణా నక్షత్ర మాస కళ్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించబడింది. తదుపరి మాస కళ్యాణం మే 9న జరుగుతుందని ఆలయ ఆర్చకులు తెలిపారు. వివాహం, సంతానం, విద్య, ఉద్యోగం, బదిలీ, పదోన్నతి, విదేశీయానం, ఆరోగ్యం, వ్యాపారం వంటి కోరికల కోసం భక్తులు ఈ మాస కళ్యాణంలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని ఈవో వెంకటరమణ తెలిపారు

April 12, 2026 / 03:26 PM IST

బాపట్లలో పుస్తకాల ఆవిష్కరణ

బాపట్ల సూర్యలంక రోడ్డులోని భావపురి బ్రాహ్మణ సదన్‌లో ఆదివారం పుస్తకావిష్కరణ సభ జరిగింది. డాక్టర్ వాసిరాజు రాధాకృష్ణ మూర్తి రచించిన ‘క్లైమేట్ చేంజ్ అండ్ అగ్రికల్చర్’, ‘గ్లోబల్ అండ్ ఇండియన్ హొరైజన్స్ ఆఫ్ హయ్యర్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్’ పుస్తకాలను మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఘనంగా ఆవిష్కరించారు.

April 12, 2026 / 03:21 PM IST

TG ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన గుత్తి వాసి

ATP: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్ష ఫలితాల్లో గుత్తికి చెందిన టీడీపీ యువనేత రవితేజ రెండవ కుమారుడు పి.సంజయ్ నాయుడు అత్యంత ప్రతిభ కనబరిచారు. మొత్తం 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. సంజయ్ నాయుడు సాధించిన ఈ విజయంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

April 12, 2026 / 03:15 PM IST

‘చెరువుకు రక్షణ గోడ ఏర్పాటు చేయాలి’

SS: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎములపల్లి చెరువు సమీపంలో రహదారి పరిస్థితి వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. చెరువు పక్కన ఉన్న మట్టి క్రమంగా దిగజారిపోవడంతో రోడ్డు అంచు బలహీనపడింది. రక్షణ గోడ లేకపోవడంతో వాహనదారులు చెరువులో పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చెరువుకు రక్షణ గోడ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

April 12, 2026 / 03:10 PM IST

దాతల సహకారం తో ట్రాఫిక్ స్టాపర్ బోర్డులు

E.G: దాతల సహకారంతో ట్రాఫిక్ స్టాపర్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు రాజమహేంద్రవరం డీఎస్పీ బి.విద్య అన్నారు. ఆదివారం మండపేట టౌన్ పోలీస్టేషన్ వద్ద వీటిని ఆమె ప్రారంభించారు. డీఎస్పీ విద్య మాట్లాడుతూ.. మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు దాతల సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

April 12, 2026 / 03:08 PM IST

అమరావతి వోఆర్ఆర్‌లో 19 ఇంటర్‌చేంజ్‌లు

GNTR: అమరావతి 190 కి.మీ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ మార్గంలో వాహనాలు ప్రవేశించడానికి, బయటకు వెళ్లడానికి వీలుగా కేవలం 19 చోట్ల ఇంటర్‌చేంజ్‌లు నిర్మించనున్నారు. మొదట 17 పాయింట్లను ప్రతిపాదించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆ సంఖ్యను 19కి పెంచారు. ప్రస్తుతం ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలన దశలో ఉంది.

April 12, 2026 / 03:04 PM IST

తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి ‘ఈబస్’ సిస్టమ్..!

VSP: పెద్ద వాల్తేరు ప్రభుత్వ చెస్ట్ ఆస్పత్రిలో రూ.1.5 కోట్ల విలువైన ‘ఈబస్’ (EBUS) సిస్టమ్‌ను మంత్రి సత్య కుమార్ ప్రారంభించారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇన్ఫెక్షన్ల గుర్తింపునకు ఇది ఎంతో కీలకం అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి అధునాతన సదుపాయం రావడం ఇదే తొలిసారి అని సూపరింటెండెంట్ సునీల్ కుమార్ తెలిపారు.

April 12, 2026 / 03:00 PM IST

‘వైసీపీ ఊసరవెల్లి ఆరోపణలు ప్రజలు నమ్మరు’

VZM: మాజీ సీఎం జగన్‌పై గతంలో బొత్స, ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలను గుర్తు చేస్తూ ఆదివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎంపీ కలిశెట్టి అప్పలనాయడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు చేస్తున్న ఊసరవెల్లి ఆరోపణలను ప్రజలు నమ్మరని, అందుకే ప్రజలకు మరోసారి గుర్తు చేస్తిన్నామన్నారు.

April 12, 2026 / 03:00 PM IST

బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన ఎంపీ

SKLM: ఎచ్చెర్ల మండలం జరజాం పంచాయతీలో టీడీపీ కార్యకర్త జరుగుల్ల లక్ష్మణరావు భార్య అన్నపూర్ణ రోడ్డు ప్రమాదంలో గాయపడింది. ఆమెకు సీఎంఆర్ఎఫ్ కింద రూ.1,28,000 చెక్కును ఆదివారం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

April 12, 2026 / 03:00 PM IST

విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల

మార్కాపురంలోని కొండేపల్లి రోడ్డులో శ్రీ పట్టాభిరామస్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం భక్తుల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కందుల నారాయణరెడ్డి తన సతీమణి వసంతమ్మతో కలిసి పాల్గొన్నారు. మహోత్సవ కార్యక్రమాలు వేద మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు.

April 12, 2026 / 02:56 PM IST

రేపల్లెలో CMRF చెక్కుల పంపిణీ

BPT: రేపల్లెలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రి అనగాని సత్యప్రసాద్ చొరవతో 33 మందికి CMRF మంజూరైంది. మంజూరైన మొత్తం రూ.32,82,393 చెక్కులను స్థానిక టీడీపీ నేతలు లబ్ధిదారులకు ఆదివారం అందజేశారు. ఆపత్కాలంలో ఆదుకున్న ప్రభుత్వానికి, మంత్రికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

April 12, 2026 / 02:42 PM IST

విడపనకల్లప్ప స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

ATP: విడపనకల్‌లో కురుబల ఆరాధ్యదైవం విడపనకల్లప్ప స్వామి గుడికట్ల ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. సాంప్రదాయ ఉత్సవాలు భక్తిభావంతో పాటు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.

April 12, 2026 / 02:40 PM IST