• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘వేసవి తీవ్రతపై అప్రమత్తం.. సదుపాయాలు సిద్ధం’

VSP: విశాఖలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా వడదెబ్బ బాధితులకు అగనంపూడి, గోపాలపట్నం, పెందుర్తి, భీమునిపట్నం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు డీసీహెచ్ఎస్ డా. ఆర్. నరేంద్ర సింగ్ తెలిపారు. ఐవీ ఫ్లూయిడ్స్, మందులు, ఓఆర్ఎస్ వంటి సదుపాయాలు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తిరగకుండా ఉండాలన్నారు.

April 23, 2026 / 10:29 PM IST

ఆస్తి పన్నులో జీవీఎంసీకి రాష్ట్ర అవార్డు

VSP: పన్ను వసూళ్లలో రికార్డు ప్రగతితో జీవీఎంసీకి రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. విజయవాడలో జరిగిన వర్క్‌షాప్‌లో కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం ఈ అవార్డును స్వీకరించారు. 2025–26లో రూ.510 కోట్ల నుంచి రూ.110 కోట్ల వృద్ధితో 21.5% పెరుగుదల నమోదు కావడం విశేషం. పన్ను చెల్లింపుదారులు, సిబ్బంది సహకారమే ఈ ఘనతకు కారణమని కమిషనర్ తెలిపారు.

April 23, 2026 / 10:16 PM IST

‘విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యం’

NDL: విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. నంద్యాలలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాలను ఆయన గురువారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో జనార్దన్ రెడ్డి, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

April 23, 2026 / 09:57 PM IST

కోటప్పకొండ డాక్యుమెంటరీ ఆవిష్కరణ

PLD: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవాలయ చరిత్రపై రూపొందిన డాక్యుమెంటరీని ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు ఆవిష్కరించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని డా. చిట్టినేని లక్ష్మీనారాయణ నిర్మించి దర్శకత్వం వహించారు. ఆలయ చరిత్ర, స్థల పురాణం ఇందులో వివరించారు. ఇలాంటి డాక్యుమెంటరీలు భావితరాలకు మార్గదర్శకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

April 23, 2026 / 09:42 PM IST

వ్యాసరచన పోటీలో విద్యార్థులకు గోల్డ్ మెడల్

KRNL: ఆలూరు ఆదర్శ పాఠశాల విద్యార్థులు వ్యాసరచన పోటీలో ప్రతిభ కనబర్చారు. గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులను ఇవాళ ప్రిన్సిపల్ వీరేష్ సత్కరించారు. జనాభా సంస్కరణ అంశంపై నిర్వహించిన పోటీలో విజయం సాధించారు. చదువుతో పాటు సమాజ స్పృహ పెంపొందించుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు.

April 23, 2026 / 09:42 PM IST

తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

TPT: తిరుమలలో ఏప్రిల్ 25 నుంచి జరిగే శ్రీ పద్మావతి పరిణయోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏర్పాటు చేసిన మండపాన్ని దశావతారం, అష్టలక్ష్ముల ఆకృతులతో సుమారు 100 మంది నిపుణులు అలంకరిస్తున్నారు. మూడు రోజుల పాటు గజ, అశ్వ, గరుడ వాహన సేవలతో పాటు కళ్యాణ మహోత్సవం జరగనుంది.

April 23, 2026 / 09:39 PM IST

రాజమండ్రిలో నల్ల దుస్తులతో ఎంపీ నిరసన పాదయాత్ర

EG: ఎన్డీఏ కూటమి బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాజమండ్రిలో పాదయాత్ర గురువారం నిర్వహించారు. మహిళలతో కలిసి ఎంపీ పురందేశ్వరి నల్ల దుస్తులు ధరించుకుని హాజరయ్యారు. పార్లమెంట్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించిన నేపథ్యంలో ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నారి శక్తిని నిరూపించుకునే సమయమని ఆమె పిలుపునిచ్చారు.

April 23, 2026 / 09:38 PM IST

ఫ్లెక్సీల ద్వారా నేరాలపై అవగాహన

SS: నేరాల నివారణపై పోలీసులు వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. గ్రామసభలు నిర్వహించి సైబర్ నేరాలు, ఆస్తి నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు వివరిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా జాగ్రత్తలతో కూడిన ఫ్లెక్సీలను గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. అనుమానితుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలపాలని సూచిస్తున్నారు.

April 23, 2026 / 09:36 PM IST

విద్యార్ధులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: ఎస్సై

కోనసీమ: విద్యార్దులు డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మండపేట రూరల్ ఎస్సై కిషోర్ తెలిపారు. తాపేశ్వరం శ్రీ పోలిశెట్టి సత్తిరాజు భూషణం జడ్పీ హైస్కూల్‌లో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులు అందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.

April 23, 2026 / 09:33 PM IST

గుడిపాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీని చేసిన డీఎస్పీ

CTR: గుడిపాల పోలీస్ స్టేషన్‌ను డీఎస్పీ వెంకటనారాయణ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసుల స్థితిగతులను సమీక్షించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో నిఘా పకడ్బందీగా ఉండాలని, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వం వహించరాదని, ఏదైనా సమాచారం ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఆయన సూచించారు.

April 23, 2026 / 09:29 PM IST

తిరుమలలో భక్తులకు విస్తృత వైద్య సేవలు

TPT: తిరుమలలో భక్తుల కోసం టీటీడీ విస్తృత వైద్య ఏర్పాట్లు చేసింది. అశ్వనీ ఆసుపత్రి ప్రధాన కేంద్రంగా మొత్తం 16 వైద్య కేంద్రాల ద్వారా సేవలు అందిస్తోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో 24 గంటల వైద్యం అందుబాటులో ఉంది. అత్యవసర పరిస్థితుల కోసం 9 అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. భక్తుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ, ఎక్కడికక్కడ తక్షణ చికిత్స అందేలా టీటీడీ పక్కా చర్యలు చేపట్టింది.

April 23, 2026 / 09:26 PM IST

ప్రశాంతి నిలయంలో సుధామృత సర్టిఫికేషన్ కోర్సు

సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి వాహిని సుధామృత కార్యక్రమం ఘనంగా జరిగింది. భగవాన్ బాబా రచించిన 15 వాహినుల్లోని సనాతన ధర్మ సూత్రాలను అధ్యయనం చేసేందుకు 12 భాషల్లో ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు. మూడు ఏళ్లుగా సాగుతున్న ఈ కోర్సులో 106 పాఠ్యాంశాల ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని భక్తులకు అందిస్తున్నారు.

April 23, 2026 / 09:21 PM IST

డ్రోన్లతో నిఘా.. విజిబుల్ పోలీసింగ్ పటిష్టం

సత్యసాయి: జిల్లా SP సతీష్ కుమార్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిని డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

April 23, 2026 / 09:18 PM IST

ముప్పాళ్లలో ఇళ్లగణనపై అవగాహన

PLD: మే 1 నుంచి 30 వరకు ఇంటింటా ఇళ్లగణన నిర్వహించనున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో స్వర్ణ తెలిపారు. ఏప్రిల్ 15–30 మధ్య సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఆన్‌లైన్ విధానం కూడా అందుబాటులో ఉందన్నారు. ముప్పాళ్ల మండలంలో కార్యక్రమాన్ని శివప్రసాద్ పర్యవేక్షిస్తూ, సిబ్బంది క్లస్టర్ల వారీగా ఇళ్లను సందర్శించి వివరాలు సేకరించాలని సూచించారు.

April 23, 2026 / 09:18 PM IST

చలివేంద్రాన్ని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్

కృష్ణా: మచిలీపట్నంలో సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ నవీన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో ప్రజల సౌకర్యం కోసం సత్య సాయి సేవ సమితి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చలివేంద్రంలో మంచినీటితో పాటు మజ్జిగ కూడా పంపిణీ చేయడం చాలా సంతోషదాయకమన్నారు.

April 23, 2026 / 09:02 PM IST