• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సంపద కేంద్రాలపై దృష్టి పెట్టాలి: ఎంపీడీవో

AKP: పంచాయతీ కార్యదర్శులు సంపద కేంద్రాలపై దృష్టి పెట్టాలని పాయకరావుపేట ఎంపీడీవో లవరాజు ఆదేశించారు. ఇవాళ పీఎల్ పురంలో సంపద కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రాలను సక్రమంగా నిర్వహిస్తే పంచాయతీలకు ఆదాయం వస్తుందన్నారు. గ్రామాల నుంచి ప్రతిరోజు సేకరిస్తున్న చెత్తను కేంద్రాలకు తరలించి సేంద్రియ ఎరువుగా మార్చాలన్నారు.

April 13, 2026 / 07:00 PM IST

‘స్వీయ గణనపై విస్తృత అవగాహన కల్పించాలి’

VZM: ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ గణన విధానంపై జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఇవాళ ఆదేశించారు. ఈ నెల 16 నుంచి 30 వరకు ప్రజలు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన 15 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

April 13, 2026 / 07:00 PM IST

అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలి: కలెక్టర్

TPT: జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో మొత్తం 380 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. అర్జీలకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు.

April 13, 2026 / 07:00 PM IST

చట్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం: సీఐ

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ ఎల్విన్‌పేట సీఐ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు సూచనలు చేశారు. మైనర్లు వాహనాలు నడపడం నేరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శివప్రసాద్ పాల్గొన్నారు.

April 13, 2026 / 07:00 PM IST

గ్రంథాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

విశాఖ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఛైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ ఆశయాలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని, తద్వారా సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.

April 13, 2026 / 07:00 PM IST

‘అంబేద్కర్ జయంతి తప్పనిసరిగా నిర్వహించాలి’

కోనసీమ: ప్రభుత్వ ఆదేశాలు మేరకు డా. బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను రావులపాలెం మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలలో తప్పనిసరిగా నిర్వహించాలని ఎంపీడీవో సుబ్రహ్మణ్యం సోమవారం ఆదేశించారు. పంచాయతీ అభివృద్ధి అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరపాలని, సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.

April 13, 2026 / 07:00 PM IST

వార్షిక రుణ ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం

ATP: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సంఘ సభ్యులు జీవనోపాధులు, ఎంటర్‌ప్రైజ్ స్థాపన కోసం రుణాలు పొందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజ సూచించారు. 50 శాతం మంది మహిళలు వ్యవస్థాపకులుగా ఎదిగేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

April 13, 2026 / 07:00 PM IST

PGRS, రెవెన్యూ క్లినిక్‌లో 183 అర్జీలు స్వీకరణ

E.G: ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదికలో వచ్చిన అర్జీల పరిష్కారంలో అలసత్వం చూపుతున్న అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్‌లో జేసీ మేఘ స్వరూప్‌తో కలిసి 183 అర్జీలను స్వీకరించారు. PGRS కింద వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో అలసత్వం వహించరాదన్నారు.

April 13, 2026 / 07:00 PM IST

‘ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరం’

సత్యసాయి: ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరం అని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పేర్కొన్నారు. సోమవారం మడకశిర పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు 82 మందికి లబ్ధిదారులకు గాను రూ.30.34 వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి పేదల పక్షపాతి అని,పేద ప్రజలు అభివృద్ధి కోసం ఎప్పుడూ కృషి చేస్తారన్నారు.

April 13, 2026 / 07:00 PM IST

అన్నవరం ఈవో రేసులో వాడపల్లి ఈవో చక్రధరరావు

KKD: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం ఇంఛార్జ్ ఈవో నియామకంపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత ఈవో త్రినాథరావు పుష్కరాల విధుల్లో బిజీగా ఉండటంతో వాడపల్లి ఈవో చక్రధరరావు, కాకినాడ డీసీ రమేష్ బాబు ఈ పదవి కోసం పోటీపడుతున్నారు. చక్రధరరావుకు ఆర్జేసీగా పదోన్నతి ఉండటంతో ఆయన నియామకానికే మొగ్గు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ప్రభుత్వం నుంచి ఆర్డర్ రావాల్సి ఉంది.

April 13, 2026 / 07:00 PM IST

మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

W.G: ఉండి మండలం పెదపుల్లేరులో సోమవారం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని సోమవారం దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సాయం ఆశించకుండా రూ. 5 కోట్లకు పైగా వ్యయంతో శివాలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నారని అన్నారు. సమస్యలు, మానసిక ఒత్తిళ్ళ నుంచి గుడికి వెళితే ఉపశమనం కలుగుతుందన్నారు.

April 13, 2026 / 06:51 PM IST

రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం నాగాయలంక మండలం సంగమేశ్వరంలో రూ.23.94 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీసీ ఛైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

April 13, 2026 / 06:50 PM IST

‘అర్జీలు రీ ఓపెన్ కాకుండా పరిష్కరించాలి’

W.G: భీమవరం కలెక్టర్ కార్యాలయంలో PGRS కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ నాగరాణి అర్జీదారుల వద్ద నుంచి 198 అర్జీలను స్వీకరించినట్లు తెలిపారు. వచ్చిన అర్జీలను విచారించి బాధితులకు న్యాయం చేసి అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

April 13, 2026 / 06:50 PM IST

మే 9న తణుకులో మెగా లోక్ అదాలత్

W.G: మే 9న తణుకులో మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నాలుగో అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవా సేవల సంస్థ ఆధ్వర్యంలో తణుకు కోర్టు ఆవరణలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ లోక్ అదాలత్ ద్వారా రాజీపడదగిన అన్ని క్రిమినల్, సివిల్ కేసులతోపాటు చెక్ బౌన్స్ కేసులు, భార్య భర్తల కేసులు రాజీ చేసుకోవచ్చని తెలిపారు.

April 13, 2026 / 06:47 PM IST

RO ప్లాంట్‌ను ప్రారంభించిన జోనల్ ఛైర్మన్

GNTR: తెనాలిలో సోమవారం RTC డిపోలో RO వాటర్ ప్లాంట్‌ను ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యం, వారి ఆరోగ్యం ప్రాధాన్యత ఇస్తూ.. మంచినీటి సౌకర్యం కల్పించామని తెలియజేశారు. జోనల్ ఛైర్మన్‌కు తెనాలి RTC డిపో మేనేజర్ రాజశేఖర్ ఘన స్వాగతం పలికారు.

April 13, 2026 / 06:45 PM IST