• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రాధాకృష్ణపై చర్యలు తీసుకోండి: వైసీపీ నేతలు

సత్యసాయి: ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ధర్మవరం వైసీపీ నాయకులు పట్టణ ఒకటో పోలీస్ స్టేషన్ సీఐ నాగేంద్ర ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. తన ఛానల్ ద్వారా మహిళలను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు ప్రసారం చేయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాను అడ్డుపెట్టుకుని రాజకీయ పక్షపాతంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

April 9, 2026 / 08:30 PM IST

109 మందికి ఉద్యోగ అవకాశాలు

TPT: చంద్రగిరి నియోజకవర్గం పాకాల గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన జాబ్ మేళా విజయవంతమైంది. ఎమ్మెల్యే పులివర్తి వెంకటప్రసాద్ ప్రారంభించిన ఈ మేళాలో 276 మంది యువతీ యువకులు పాల్గొనగా 109 మంది వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. 26 మంది షార్ట్‌లిస్ట్ అయ్యారు. 12 బహుళజాతి కంపెనీలు పాల్గొని సుమారు 900 ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంచాయి.

April 9, 2026 / 08:28 PM IST

మంగళం- రేణిగుంట రోడ్డుకు మార్గం సుగమం

TPT: తిరుపతి నగర ప్రజల దీర్ఘకాల స్వప్నమైన మంగళం ఆర్టీవో కార్యాలయం నుంచి శెట్టిపల్లి మీదుగా రేణిగుంట వరకు నిలిచిపోయిన రహదారి నిర్మాణానికి ముందడుగు పడింది. ఈ మేరకు మంగళం వద్ద తెలుగు గంగ పైప్‌లైన్ షిఫ్టింగ్ పనులకు తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు.

April 9, 2026 / 08:27 PM IST

‘పిల్లలకు చిన్నతనం నుంచే మంచి అలవాట్లు నేర్పాలి’

W.G: పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం చిన్ననాటి నుంచే మంచి అలవాట్లు అలవర్చడం అత్యంత ముఖ్యమని జెసి రాహుల్ కుమార్ తెలిపారు. గురువారం జేసీ కార్యాలయంలో ఎనిమిదవ పోషణ పక్వాడ 2026 కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. చిన్నప్పటి నుంచే ఆరోగ్యకరమైన ఆహారం, వ్యక్తిగత శుభ్రత, క్రమబద్ధమైన జీవన విధానంపై పిల్లలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.

April 9, 2026 / 08:23 PM IST

రాధాకృష్ణపై పోలీసులకు మాజీ ఎమ్మెల్యే కాటసాని ఫిర్యాదు

NDL: బనగానపల్లె పోలీస్ స్టేషన్‌లో ఏబీఎన్ సంస్థల అధినేత రాధాకృష్ణపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న ప్రసారమైన కార్యక్రమంలో మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని కాటసాని అన్నారు. మహిళలను అవమానించే వ్యాఖ్యలను సహించబోమన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

April 9, 2026 / 08:22 PM IST

నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ బస్సులపై చర్యలు

E.G: రాజమండ్రి నుంచి హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు నడుస్తున్న ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ ఆదేశాల మేరకు గత 2 రోజులుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించగా మొత్తం 5 స్లీపర్ కోచ్ బస్సులను సీజ్ చేశారు. ఈ బస్సుల్లో పలు నిబంధనల ఉల్లంఘనలు చేసినట్లు గుర్తించారు.

April 9, 2026 / 08:20 PM IST

పబ్లిక్ రస్తాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు: తహసీల్దార్

KDP: ప్రొద్దుటూరు మండలం నంగనూరుపల్లెలో గురువారం రోడ్డు ఆక్రమణలను రెవెన్యూ, పోలీస్ అధికారులు తొలగించారు. మేకల పెద్ద నాగయ్య అనే వ్యక్తి రస్తాకు అడ్డుగా బండరాళ్లు ఏర్పాటు చేసి ఆక్రమించారని MRO గంగయ్య తెలిపారు. రూరల్ ఎస్సై, VTOలతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆ అడ్డంకులను తొలగించారు. ప్రజా రహదారులను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

April 9, 2026 / 08:20 PM IST

‘పిల్లలకు పోషకాహారాన్ని అందించండి’

ELR: పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యానికి మొదటి ఆరు సంవత్సరాలలో అందించే పోషకాహారమే ప్రధానమని కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు. పోషణ అభియాన్‌లో భాగంగా 8వ విడత పోషణ పక్వాడ పోస్టర్‌ను కలెక్టర్ గురువారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్న పిల్లల్లో పోషకాహార లోపాన్ని పోగొట్టేందుకు పూర్తిస్థాయిలో పోషకాహారాన్ని అందిస్తున్నామన్నారు.

April 9, 2026 / 08:15 PM IST

డిప్యూటీ ఎంపీడీవోకు అవార్డు

ASR: 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొయ్యూరు మండలంలో పన్నులు, పన్నేతర వసూళ్లలో 100% లక్ష్యాన్ని సాధించినందుకు ఇంఛార్జ్ డిప్యూటీ ఎంపీడీవో ఎం. బాబూరావుకు ఉత్తమ అవార్డు లభించింది. గురువారం పాడేరులో జరిగిన కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్, డివిజనల్ అధికారి పీఎస్ కుమార్ చేతుల మీదుగా ఆయన ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కృషిని అధికారులు అభినందించారు.

April 9, 2026 / 08:12 PM IST

‘గృహ గణన బాధ్యతతో చేయాలి’

AKP: నక్కపల్లి మండలంలో మే 1వ తేదీ నుంచి నిర్వహించే గృహ గణనలో పాల్గొనే సిబ్బందికి మూడు రోజులు పాటు నిర్వహించే శిక్షణ తరగతులను ఎంపీడీవో చిన్నకృష్ణ గురువారం ప్రారంభించారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం గృహ గణన చేయాలన్నారు. వచ్చే ఏడాది జనగణన కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు.

April 9, 2026 / 08:11 PM IST

విశాఖలో “మన ఊరు-మన జెండా” కార్యక్రమం

VSP: భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా “మన ఊరు-మన జెండా” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్, విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. యువత స్టార్టప్ ఇండియా వంటి అవకాశాలను వినియోగించుకోవాలన్నారు.

April 9, 2026 / 08:08 PM IST

ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్

TPT: తిరుపతి జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు సంవత్సరాలుగా 59 ట్రాన్స్‌ఫార్మర్‌లను ధ్వంసం చేసి రాగి వైర్లు దొంగిలించిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 2.72 లక్షల విలువ గల రాగి వైర్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

April 9, 2026 / 08:03 PM IST

ప్రజల సంతృప్తిలో జిల్లా నాలుగో స్థానం

VZM: జిల్లా అభివృద్ధికి సంబంధించి కీలక ప్రతిపాదనలపై CM చంద్రబాబు సానుకూలంగా స్పందించారని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. అమరావతిలో జరిగిన సమీక్షలో ఈ అంశాలపై చర్చించారని చెప్పారు. ప్రజల సంతృప్తిలో జిల్లా 4వ స్థానం సాధించిందని, విద్యుత్, RTC, రిజిస్ట్రేషన్ల సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారన్నారు.

April 9, 2026 / 08:02 PM IST

నీటి భద్రతపై అవగాహన కార్యక్రమం విజయవంతం

TPT: వరదయ్యపాలెం మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన “నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత” అంశంపై అవగాహన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. నీటి సంరక్షణతోనే భవిష్యత్తు సురక్షితమని, భూగర్భ జలాల పునరుద్ధరణకు సమిష్టి కృషి అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయమ్మ, నీటిపారుదల ఏఈ ఎన్ బాబు, వ్యవసాయ శాఖ అధికారి ఆర్ గౌరీ పాల్గొన్నారు.

April 9, 2026 / 08:00 PM IST

డీఎస్పీ కార్యాలయం ఎదుట వైసీపీ శ్రేణుల ధర్నా

ATP: గుంతకల్లు DSP కార్యాలయం ఎదురుగా గురువారం వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి మాట్లాడుతూ.. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఏబీఎన్ రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఎస్పీ శ్రీనివాసులకు అందజేశారు.

April 9, 2026 / 08:00 PM IST