అన్నమయ్య: మదనపల్లిలో రహదారి భద్రతపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రమాదాల నివారణకు 232 కీలక ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 50 చోట్ల పనులు పూర్తయ్యాయని, మిగిలిన ప్రదేశాల్లో వేగంగా పూర్తి చేయాలని సూచించారు.జిల్లాలో 19 బ్లాక్ స్పాట్లను గుర్తించి, వాటిలో 14 చోట్ల భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ELR: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి ప్రజలకు అండగా నిలవాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. శనివారం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే వాటిని పరిశీలించారు. అలాగే సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
TPT: తిరుపతి జిల్లాలో జలధార–జలహారతి పథకం కింద చేపడుతున్న పనులతో పుత్తూరు మండలంలో నీటి సంరక్షణకు ఊతమిస్తోంది. కాలువల పూడికతీత, చెరువుల పునరుద్ధరణతో సుమారు 300 ఎకరాల గిరిజన భూములకు సాగునీరు అందే పరిస్థితి ఏర్పడుతోంది. ఉపాధి హామీ కింద గిరిజనులకు రోజుకు రూ.300 వేతనం లభిస్తూ ఆదాయం కలుగుతోంది. ఈ పనులతో నీటి వనరులు పెరిగి రైతులకు లాభం చేకూరుతుందన్నారు.
KDP: రాబోయే వర్షా కాలంలో బద్వేల్లో నీటి నిల్వలు, మురుగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలకు మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సూచనల మేరకు పట్టణంలోని ప్రధాన కాలువలు శుభ్రపరిచే పనులను మున్సిపల్ సిబ్బంది శనివారం ప్రారంభించారు. కాలువల్లో పూడికను తొలగించి వర్షపునీరు సజావుగా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కోనసీమ: ధాన్యం సేకరణలో జాప్యం జరిగినా, రైతుల నుంచి ఫిర్యాదులు అందినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ నిధియాదేవి హెచ్చరించారు. శనివారం ఆమె ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి-1 రైతు సేవా కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తేమ శాతం పరికరాల ద్వారా పరిశీలించి రికార్డులు సమీక్షించారు.
PLD: జిల్లాలో ప్రకృతి సేద్యంపై అవగాహన పెంపు అవసరమని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కే. అమల కుమారి పేర్కొన్నారు. శనివారం నరసరావుపేటలో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. 2026–27 నాటికి 82,595 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ కోసం విత్తన కిట్లు అందుబాటులో ఉంచినట్టు చెప్పారు.
NTR: జిల్లాలో నీటి భద్రత సాధనకు జలధార-జలహారతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో శనివారం ఆయన మాట్లాడారు. నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా గౌరవ సీఎం దార్శనికతకు అనుగుణంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 100 రోజుల ప్రత్యేక కార్యాచరణగా చేపడుతు...
మార్కాపురం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమ సమయాల్లో మార్పులు చేశారు. ఎండలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 27న జరిగే కార్యక్రమం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ సునీత తెలిపారు. ప్రజలు మార్పును గమనించి నిర్ణీత సమయానికి హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించాలన్నారు.
NDL: మిడుతూరు నంద్యాల ఆర్జీఎం కాలేజీ బస్సు డ్రైవర్ మదర్ సా(50) గుండెపోటుతో మృతి చెందాడు. జలకనూరు బాట వద్ద బస్సు డ్రైవర్ మదర్ సాకు గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పి పొలాల్లోకి వెళుతుండగా బస్సులో ఉన్న అన్వర్ అప్రమత్తమై బస్సును ఆపడం జరిగిందన్నారు. మదర్ సాను ఆసుపత్రికి తీసుకవెళ్ళాడు. వైద్యాధికారి సుజాత వైద్య పరీక్షలు నిర్వహించి మృతి చెందినట్లు తెలిపారు.
KDP: ఒంటిమిట్ట పరిధిలో పలు కేసుల్లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుల దూషణ, దాడి కేసులో ముగ్గురు, హత్య కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. రౌడీలు జాగ్రత్తగా ఉండాలని ఏఎస్పీ మనోజ్ హెచ్చరించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు కొనసాగుతోంది. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
కర్నూలు: ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అందరి భాగస్వాసనంతో నగరాన్ని అన్ని విధాల తీర్చిదిద్దామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలు కల్పన, పారిశుద్ధ్యం, పచ్చదనం, ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
ఏలూరులో నేరాల నియంత్రణ కోసం పోలీసులు–వ్యాపారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఏలూరు వన్ టౌన్ పరిధిలో బంగారు వ్యాపారులు మరియు ప్రధాన దుకాణదారులతో సమావేశం జరిగింది. దుకాణాల్లో హైటెక్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచాలని సూచించారు. మోషన్ సెన్సార్ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉపయోగించాలని తెలిపారు.
CTR: గంగాధర నెల్లూరు నియోజకవర్గం కొల్లాగుంటలో భూవివాదం కలకలం రేపుతోంది. జయమ్మ కుటుంబానికి చెందిన 0.38 సెంట్ల భూమిని సుంకర మునికృష్ణయ్య ఆక్రమించి, వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన డాక్టర్ యుగంధర్ పొన్న, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే ఈ అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
TPT: ఈనెల 27, 28 తేదీలలో గౌరవ భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తిరుపతి–తిరుమల పర్యటన నేపథ్యంలో తిరుమలలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, డీఆర్వో నరసింహులు, ఉపరాష్ట్రపతి కార్యాలయ అధికారులు సమావేశంలో పాల్గొని భద్రత, వసతి, రవాణా తదితర ఏర్పాట్లపై చర్చించారు. పర్యటన సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
WG: మే 9న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని, కక్షిదారులకు త్వరితగతిన న్యాయం చేకూర్చడమే లక్ష్యంగా పోలీస్ అధికారులు పనిచేయాలని నరసాపురం 10వ అదనపు జిల్లా జడ్జి ఎ.వాసంతి పిలుపునిచ్చారు. శనివారం నరసాపురం కోర్టు ప్రాంగణంలో పోలీస్ ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. క్రిమినల్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.