• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

భీమవరంలో మహాత్మ పూలే జయంతి కార్యక్రమం

W.G: భీమవరం తహసిల్దార్ ఆఫీస్ ఆవరణలో విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పూలే సేవా సమితి అధ్యక్షులు M.V.R. అప్పాజీ మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు పూలే అన్నారు. షేక్ కాసిం, అల్లు శ్రీనివాస్, బాషా తదితరులు పాల్గొన్నారు.

April 11, 2026 / 01:25 PM IST

‘అణగారిన వర్గాల ఆశాజ్యోతికి ఘన నివాళి’

​PPM: పుస్తక పఠనమే సామాజిక మార్పుకు పునాది, మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో మార్పు సాధ్యం ఆని DRO కె.హేమలత అన్నారు. ఈ​కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం, చదువు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, రచనలను చదవడం ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు.

April 11, 2026 / 01:25 PM IST

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి: ఎమ్మెల్యే

NDL: ప్యాపిలి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి శనివారం నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామం, వార్డులో బలమైన కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

April 11, 2026 / 01:24 PM IST

సివిల్స్ విజేతను సన్మానించిన ఎమ్మెల్యే

SKLM: జి.సిగడాం మండలం నడిమవలస పంచాయతీకి చెందిన సివిల్స్ విజేత సౌరోతు రాము ఇవాళ ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనను సన్మానించి, మాట్లాడారు. సామాన్య కుటుంబంలో పుట్టి అహర్నిశలు శ్రమించి ఉన్నత లక్ష్యానికి పేదరికం అడ్డు కాదని నిరూపించిన వ్యక్తి రాము అని తెలిపారు. రాముని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

April 11, 2026 / 01:23 PM IST

పూలే జయంతి వేడకల్లో పాల్గొన్న MLA

KDP: ప్రొద్దుటూరులో శనివారం ఉదయం ‘జ్యోతిరావు పూలే’ జయంతి కార్యక్రమంలో స్థానిక MLA నంద్యాల వరదరాజులరెడ్డి పాల్గొన్నారు. స్థానిక మైదుకూరు రోడ్డులోని విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు. జ్యోతిరావు పూలే ఆశయాలు కొనసాగిస్తామన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు ముక్తియార్, రాజగోపాల్ పాల్గొన్నారు.

April 11, 2026 / 01:21 PM IST

పేదలకు CMRF గొప్ప వరం: MLA

NDL: నందికొట్కూరు పట్టణం ABM పాలెంకు చెందిన ఇద్దరికీ రూ. 91,000 విలువైన CMRF చెక్కులను శనివారం ఎమ్మెల్యే గిత్త జయసూర్య అందజేశారు. ఆపదలో ఉన్న నిరుపేదలకు ఈ నిధులు కొండంత అండగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సురేంద్ర నాథ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

April 11, 2026 / 01:15 PM IST

రాజ గోపుర పునః నిర్మాణానికి శంకుస్థాపన

W.G: నరసాపురం శ్రీ ఆదికేశవ స్వామి వారి దేవస్థాన రాజగోపుర పునః నిర్మాణ శంకుస్థాపన మహోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామివారు ఆశీర్వచనాలు అందుకున్నారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు ఈ పుణ్య కార్యానికి శంఖుస్థాపన చేశారు.

April 11, 2026 / 01:11 PM IST

మహాత్మ జ్యోతిరావు పూలేకు మంత్రి, కలెక్టర్ నివాళి

NDL: పట్టణంలోని పద్మావతి నగర్ ఆర్చ్ వద్ద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శనివారం ఆయన విగ్రహానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పుష్పమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలు చిరస్మణీయమన్నారు. జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తిక్, పలు సంఘాల నేతలు పాల్గొన్నారు.

April 11, 2026 / 01:11 PM IST

పూలే జయంతి సందర్భంగా సీఎం ఘన నివాళులు

GNTR: సామాజిక విప్లవయోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన పూలే ఆశయాలను కొనసాగించడం ప్రభుత్వ ధ్యేయమని సీఎం పేర్కొన్నారు.

April 11, 2026 / 01:11 PM IST

సచివాలయ ఉద్యోగులకు ముగిసిన జనగణన శిక్షణ

KRNL: గోనెగండ్ల మండల పరిషత్ అభివృద్ధి శాఖ కార్యాలయంలో 2027 జనాభా గణన సర్వే మొదటి దశ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. సచివాలయ, సర్వే సిబ్బందికి 3 రోజుల పాటు అవగాహన తరగతులు నిర్వహించారు. దేశ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో జనాభా గణన అత్యంత కీలకమని ఎన్యుమరేటర్ నరసింహులు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన గణాంకాలు సేకరించనున్నారు.

April 11, 2026 / 01:11 PM IST

అక్షర యోధుడు జ్యోతిబా పూలేకు పోలీసుల నివాళులు

అన్నమయ్య: సామాజిక చీకట్లను తొలగిస్తూ విద్యా వెలుగులు నింపిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి కొనియాడారు. శనివారం మదనపల్లి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

April 11, 2026 / 01:11 PM IST

RTC బస్టాండును అందుబాటులోకి తెస్తాం:MLA

KDP: ప్రొద్దుటూరులోని నూతన ఆర్టీసీ బస్టాండును ప్రయాణికులకు త్వరగా అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులను స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆదేశించారు. ఆయన శనివారం ఉదయం బస్టాండును పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వాహనాల రాకపోకలకు వేరువేరుగా దారి ఏర్పాటు చేయాలన్నారు. అడ్డుగా ఉన్న డివైడర్లను తొలగించాలన్నారు.

April 11, 2026 / 01:10 PM IST

‘రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది’

ELR: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. శనివారం భీమడోలు మండలం గుండుగొలను సొసైటీ రైతుసేవాకేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈమేరకు సేకరించిన ధాన్యం లోడు లారీని జెండా ఊపి ప్రారంభించారు.

April 11, 2026 / 01:08 PM IST

లోగిసలో సీసీ రోడ్లు ప్రారంభించిన మంత్రి

VZM: గజపతినగరం మండలంలోని లోగిస గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, కాలువలను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామంలో 114 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, కాలువలు నిర్మించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గోపాల రాజు పాల్గొన్నారు.

April 11, 2026 / 01:04 PM IST

సీఎం చంద్రబాబు కోసం హోమాలు నిర్వహించిన ఎమ్మెల్యే

ATP: ఈనెల 20న CM చంద్రబాబు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాయదుర్గం శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తన కుటుంబ సభ్యులతో కలిసి హోమాలు నిర్వహించారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలని స్వామిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.

April 11, 2026 / 01:00 PM IST