• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

భక్తి శ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు

KDP: కలసపాడులో సగిలేరు నది ఒడ్డున ఉన్న ఎస్పీజీ, పరిశుద్ధ పేతురు – పరిశుద్ధ పౌలు పట్టణ చర్చిలో ఈస్టర్ ఆరాధన దేవునికి మహిమకరంగా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులంతా మహదానందంతో, భక్తిపారవశ్యంతో ఈస్టర్ పండుగను జరుపుకొంటున్నారు. పునరుజ్జీవానికి గుర్తు, మరణంపై యేసుక్రీస్తు సాధించిన విజయానికి ప్రతీక ‘ఈస్టర్’ అని రెవరెండ్ సింగమల ఆశీశ్ గాబ్రియేల్ అన్నారు.

April 5, 2026 / 10:11 PM IST

క్రియాశీల సభ్యుని ఇంటికి బీమా అందజేత

TPT: శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన బుర్ర ప్రియాంక ఇటీవల మరణించారు. వారి కుటుంబానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ తాళ్లూరి ప్రమాద బీమా చెక్కును ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

April 5, 2026 / 10:08 PM IST

ఏపీఐఐసీ ఎండీగా దినేష్ కుమార్

GNTR: ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఏ.ఎస్. దినేష్ కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని ప్రధాన కార్యాలయంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ఆయన 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా సేవలందించారు. అక్కడి నుంచి ఆయనకు ఏపీఐఐసీ ఎండీగా పదోన్నతి లభించింది.

April 5, 2026 / 10:00 PM IST

సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్

NTR: కలెక్టరేట్‌లో ఈ నెల 6న సోమవారం “మీకోసం” పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. రెవెన్యూ సమస్యల కోసం రెవెన్యూ క్లినిక్‌లు కూడా నిర్వహిస్తారు. Meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చన్నారు.

April 5, 2026 / 10:00 PM IST

జిల్లా చైర్మన్‌గా కునిగిరి నీలకంఠ నియామకం

KRNL: నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇవాళ మంగళగిరిలో జిల్లా ఛైర్మన్‌ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. కునిగిరి నీలకంఠ కర్నూలు జిల్లా చైర్మన్‌గా నియామక పత్రాన్ని స్వీకరించారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గ్రీన్ ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. ప్రతి పౌరుడు ప్రకృతి సంరక్షణలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

April 5, 2026 / 09:55 PM IST

బొబ్బిలికి వరాలు జల్లు కురిపించిన మంత్రి

VZM: రాష్ట్ర పురపాలిక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ బొబ్బిలికి వరాల జల్లు కురిపించారు. వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం ఆయన మూడున్నర కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఆదివారం బొబ్బిలి పర్యటనలో భాగంగా రాణి మల్లమాదేవి పార్కును సందర్శించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

April 5, 2026 / 09:35 PM IST

బేతంచెర్లలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

NDL: బేతంచెర్లలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. వివిధ కుల సంఘాల నాయకులు మేకల నాగరాజ్,రాజయ్య,నత్తి సత్యంలు పట్టణంలోని రైల్వే గెట్ సమీపంలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.118వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

April 5, 2026 / 09:31 PM IST

నలుగురు జూదరులు అరెస్ట్

SKLM: ఆమదాలవలస మండలం వంజంగి గ్రామ గెడ్డగట్టు పైన పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను ఆదివారం సాయంత్రం ఎస్సై ఎస్. కాంతారావు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ.10,020 లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పేకాట ఆడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

April 5, 2026 / 09:28 PM IST

యాడికిలో వాహనాల రాకపోకలు మళ్లింపు

ATP: CM చంద్రబాబు నాయుడు సోమవారం యాడికి పర్యటించనున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలు మళ్లిస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వేములపాడు క్రాస్ నుంచి యాడికి మార్గంలో వాహనాలకు అనుమతి నిలిపివేశారు. గుత్తి నుంచి రాయలచెరువు మీదుగా వెళ్లే సిమెంట్ లారీలు జాతీయ రహదారి-67 ద్వారా తాడిపత్రి వైపు వెళ్లాలని సూచించారు.

April 5, 2026 / 09:20 PM IST

సమస్యలు సామరస్యంగా పరిష్కరించాలి: మంత్రి టీజీ భరత్

KRNL: మున్సిపల్ కాంట్రాక్టర్లు, అధికారులు పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని మంత్రి టీజీ భరత్ సూచించారు. ఇవాళ నగరపాలక సమావేశ భవనంలో జరిగిన సమావేశంలో అధికారులతో ఆయన మాట్లాడుతూ.. ప్రతి పది రోజులకు ఒకసారి సమావేశాలు నిర్వహించాలని, బిల్లులను పారదర్శకంగా కాంట్రాక్టర్ల ఆమోదంతోనే మంజూరు చేయాలని ఆదేశించారు

April 5, 2026 / 09:19 PM IST

ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి

TPT: మార్కెట్ కమిటీల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేత కిరణ్ డిమాండ్ చేశారు. మామిడికాయల యార్డులో జరిగిన సమావేశంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం, జీతాల పెంపు, పదవీ విరమణ వయస్సు పెంపు వంటి డిమాండ్లు చేశారు. బీమా పెంపు, టైం స్కేల్, ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

April 5, 2026 / 09:04 PM IST

క్రికెటర్ సుల్తానాకు అభినందన

PLD: జాతీయ టీ-10 మహిళా క్రికెట్ టోర్నీలో ఏపీ జట్టు గెలుపొందింది. ఇందులో పల్నాడు జిల్లా కారుచోలకు చెందిన హర్షియా సుల్తానా కీలక పాత్ర పోషించింది. ఆదివారం ఆమె ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ను కలిశారు. సుల్తానాతో పాటు ఆమె తల్లిదండ్రులను ఆయన అభినందించారు. భవిష్యత్తులో జాతీయ జట్టుకు ఎంపికవ్వాలని ఆయన ఆకాంక్షించారు.

April 5, 2026 / 09:02 PM IST

వైభవంగా కోదండ రామాలయంలో పుష్పయాగం

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో పుష్పయాగం వైభవంగా జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కార్యక్రమానికి ఈ వివిధ ప్రాంతాల నుంచి 3 టన్నుల 12 రకాల పుష్పాలను, 6 రకాల పత్రాలను తెప్పించారు. వీటితో సీతారామలక్ష్మణులకు పుష్ప నీరాజనం కన్నుల పండువగా సాగింది.

April 5, 2026 / 09:01 PM IST

బాపట్ల పట్టణంలో రేపు విద్యుత్ అంతరాయం

BPT: పట్టణంలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక భావనారాయణ స్వామి ఆలయ పాత రథాన్ని గుడి వద్ద నుంచి తూర్పు సత్రం స్థలానికి తరలిస్తున్నారు. అందువల్ల ముందస్తు జాగ్రత్తగా గడియార స్తంభం నుంచి కొత్త బస్టాండ్ వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు కరెంటు నిలిపివేయనున్నారు.

April 5, 2026 / 09:00 PM IST

మందపల్లిలో గణపతికి పంచలోహ కవచం బహుకరణ

కోనసీమ: కొత్తపేట మండలం మందపల్లిలో శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న ఉమా నాగేశ్వర స్వామి ఆలయంలో గణపతికి ఆదివారం విజయవాడ కు చెందిన పల్లపు రాజు వెంకట సత్యనారాయణ దంపతులు పంచలోహ కవచాన్ని అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితుడు వెంకన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

April 5, 2026 / 09:00 PM IST