విశాఖపట్నంలో జీవీఎంసీ కమిషనర్ పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బులు అడుగుతూ మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ వాట్సాప్ ఖాతాలతో అధికారులు, ప్రజలకు మెసేజ్‌లు పంపుతూ అత్యవసరమని చెబుతున్నారు. ఇలాంటి ఫేక్ సందేశాలకు స్పందించవద్దని, అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు హెచ్చరించారు.
CTR: జల జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించాలి అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో జల జీవన్ మిషన్ పురోగతిపై సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తర్వాత పలు అంశాలపై దిశ నిర్దేశం చేసి తగు సూచనలు ఇచ్చారు.
PLD: యడ్లపాడుకు చెందిన షేక్ శంషాద్‌బీకి సీఎం సహాయనిధి నుంచి రూ.1,03,447 మంజూరయ్యాయి. మంగళవారం ఈ ఎల్వోసీ పత్రాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. పేదల వైద్యానికి కూటమి సర్కారు అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నామని ప్రత్తిపాటి ఈ సందర్భంగా తెలిపారు.
కృష్ణా: రైతులకు అవగాహన పెంపొందించేందుకు కిసాన్ గోష్టి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సుధారాణి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం ఎన్. రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాటవ్వగా, వరి, మినుము పంటలపై చర్చలు జరిగాయి.
BPT: పిట్టలవానిపాలెం మండలంలో డబ్బుల విషయంలో తల్లిదండ్రులతో గొడవపడి మద్రాస్ రైలు ఎక్కిన నాగసాయి అనే బాలుడిని చందోలు ఎస్సై శివకుమార్ యాదవ్ గంటల వ్యవధిలో క్షేమంగా గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చెన్నైలో ఉన్న బాలుడిని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్సై పనితీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
KRNL: తుగ్గలి మండలంలో జొన్నగిరి గోల్డ్ మైన్స్ సంబంధిత పెండింగ్ భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఇవాళ కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గోల్డ్ మైన్స్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఉత్పత్తి ప్రక్రియ మొత్తం విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
KDP: పొద్దుటూరు శివాలయంలో జరిగిన దొంగతనంపై ఇవాళ జనసేన పార్టీ నాయకుడు మాదాసు మురళి 2టౌన్ సీఐ వంశీనాథ్‌కు ఫిర్యాదు చేశారు. శివాలయంలో స్వామివారికి చెందిన వెండి ఆభరణాలు మాయమయ్యాయని, అమ్మవారి బంగారు హారం స్థానంలో నకిలి హారాన్ని ఉంచారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి, మాయమైన ఆభరణాలను రికవరీ చేయాలని, దోషులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ATP: గుత్తి మున్సిపాలిటీలోని చెట్నేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ప్రభుత్వ హోమియో డాక్టర్ తిరుపతి నాయుడు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించారు. కనీసం రోజుకు 3-4 లీటర్ల నీరుని తీసుకోవాలన్నారు. వదులుగా ఉండే తేలికపాటి దుస్తులను ధరించాలన్నారు. పాఠశాలలోని 120 మంది విద్యార్థులకు హోమియో మందులను అందజేశారు.
PLD: చిలకలూరిపేట మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్, వైసీపీ నేత షేక్ అబ్దుల్లా టీడీపీలో చేరారు. మంగళవారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో కుటుంబ సమేతంగా ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. అబ్దుల్లా చేరికతో పట్టణంలో పార్టీ బలపడుతుందని ప్రత్తిపాటి అన్నారు. ఎమ్మెల్యే చేసిన అభివృద్ధికి ఆకర్షితుడనై తాను పార్టీ మారానని అబ్దుల్లా తెలిపారు.
AKP: ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై పురుషోత్తం హెచ్చరించారు. పాయకరావుపేటలో జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో వివిధ అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. బాలికల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. న్యూ క్రిమినల్ చట్టాలు, పోస్కో యాక్ట్, సైబర్ ఫ్రాడ్ గురించి వివరించారు.
ASR: గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల జీవితాలు నాశనం అవుతాయని ఈగల్ టీమ్ ఇన్స్పెక్టర్ జీ.దేముళ్లు అన్నారు. ఈగల్ టీమ్, జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం కళాశాలలో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
BPT: సంతమాగులూరు మండలం కొమ్మాలపాడులో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రూ.50 లక్షల CSR నిధులతో నిర్మించిన నూతన కాపు కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ భవనం కాపు సామాజికవర్గ వివాహాలు, ఆత్మీయ సమావేశాలకు వేదికగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం గ్రామ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని, అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ATP: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రేపు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు.
CTR: సదుం మండలంలోని సజ్జలవారిపల్లెలో మంగళవారం పోషణ్ పక్వాడాపై ఐసీడీఎస్ సూపర్వైజరు మళ్లీశ్వరి అవగాహన కల్పించారు. యోగా ఉపయోగాలను వివరించారు. ప్రతి ఒక్కరూ దైనందిక జీవితంలో యోగాకు సమయం కేటాయించాలని సూచించారు. మానసిక, శారీరక ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. తప్పని సరిగా సమతుల పోషకాహారం తీసుకోవాలని సూచించారు.
NDL: ‘జలమే జీవం – జల సంరక్షణే ధ్యేయం’ అని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం కరివేన చెరువు కాలువ వద్ద ఇవాళ జలధార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలతో కలిసి కాలువలో పూడికతీత పనులు చేపట్టారు. భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చూడడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు.