NTR: కాకినాడ రూరల్‌కు చెందిన సూర్య నారాయణమూర్తి, వారి కుటుంబ సభ్యులు విజయవాడ కనక దుర్గమ్మ ఆలయ అన్నదాన పథకానికి రూ.1,01,116 డీడీని విరాళంగా ఇచ్చారు. దుర్గమ్మ సన్నిధిలో భక్తులకు నిరంతర అన్నప్రసాద వితరణ కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందించారు.
ATP: జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రోన్లతో విస్తృత నిఘా చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. జనసాంద్రత గల ప్రాంతాలు, పట్టణ కేంద్రాలు, సున్నితమైన ప్రదేశాల్లో డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అనుమానాస్పద కదలికలను గుర్తిస్తూ నేరాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
VZM: స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కె. పట్టాభిరామ్ రాజాం మున్సిపాలిటీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలో శుభ్రత నిర్వహణను మరింత మెరుగుపరచాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాజాం డంపింగ్ యార్డులో రూ 1.62కోట్ల వ్యయంతో ఆధునిక ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
KDP: VN పల్లె (M) పాలగిరిలో గ్రామానికి విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేశారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పిచ్చి మొక్కలు ఉండడంతో తరచుగా విద్యుత్ అంతరాయం కలుగుతుందని ప్రజలు తెలిపారు. సంబంధిత అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పిచ్చి మొక్కలు తొలగించి విద్యుత్‌కు అంతరాయం లేకుండా చూడాలని కోరారు.
E.G: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 100 సంవత్సరాల వేడుకలో భాగంగా ప్రతిష్ట వ్యక్తుల సమ్మేళనం రాజమహేంద్రవరం మంజీర కన్వెన్షన్ హాల్లో ఆదివారం నిర్వహించారు. 1925లో స్థాపించబడిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా లక్షకు పైగా సమావేశాలు, ప్రజల్లో చేరువుగా ఉండి చైతన్యాన్ని నింపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమిరాధ, ఏపీ ఆర్. చౌదరి పాల్గొన్నారు.
ATP: కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన దివ్య అనే చిన్నారి కర్ణాటక ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. స్థానిక నాయకులు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు దృష్టికి తీసుకురావడంతో వెంటనే తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి పంపేందుకు వారికి ఆర్ధిక సాయంగా 20 వేల రూపాయలు అందించి, ఆసుపత్రికి వెళ్లేందుకు అంబులెన్సు ఏర్పాటు చేశారు.
సత్యసాయి: సోమందేపల్లి మండలం రంగేపల్లి గ్రామంలో ఇవాళ 24 గంటల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను రాష్ట్ర సగర, ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ ప్రారంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా 24 గంటల కరెంటు లేక గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, మంత్రి సవిత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని అమలు చేశారని అన్నారు.
ELR: నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చన్నారు. ప్రతి సమస్యను ఆన్లైన్ చేసి, నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడం జరుగుతుందన్నారు.
CTR: వెదురుకుప్పం నుంచి చిత్తూరు వైపు అక్రమంగా గ్రానైట్ రాయి తరలిస్తున్న లారీని పెనుమూరు పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలో అనుమతులు లేని క్వారీల నుంచి రాళ్లను తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికారులు అడ్డుకున్నా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.
KDP: జిల్లా ఎస్పీ ఆదేశాలతో రాజంపేటలో సీఐ నాగార్జున ఆధ్వర్యంలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి యాప్, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ల వినియోగంపై మహిళలకు వివరించారు. పోలీసులు తక్షణ స్పందన అందిస్తారని తెలిపారు. పాత బస్ స్టాండ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.3,65,570 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 299 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 42 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించారని, 2369 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.
TPT: చిన్నగొట్టిగల్లు(M) మట్లువారిపల్లెలో రైతులు తమ పొలాలకు వెళ్లే దారులపై అడ్డంకులు ఏర్పడటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న YCP నేత చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి గ్రామాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు రైతులకు అండగా ఉంటామని, అధికారుల దృష్టికి తీసుకెళ్లి దారి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
KRNL:పెద్దకడబూరులో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు DSP భార్గవి తెలిపారు. నిందితుల వారి వద్ద నుంచి సుమారు 15 తులాల బంగారం, 65 తులాల వెండి ఆభరణాలు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 28న హనుమపురంలో ఓఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలు దొంగలించిన ఘటనపై కేసులో పోలీసులు, టెక్నికల్ ఆధారాలతో నిందితులను గుర్తించామన్నారు.
NDL: వేసవి దృష్ట్యా సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సమయాన్ని మార్చినట్లు కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సందర్భంగా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
అన్నమయ్య: మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా టీడీపీ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 35 వార్డుల ఇన్ఛార్జ్, నాయకులు పాల్గొన్నారు. గెలుపే లక్ష్యంగా ప్రతి వార్డులో బలంగా పనిచేయాలని, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీ బలోపేతానికి సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.