ప్రకాశం: కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్డులో పొగాకు గూడెం నందు పేకాట ఆడుతున్న 9 మందిని ఎస్సై శివ నాగరాజు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 9,330 స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్సై శివ నాగరాజు హెచ్చరించారు. మత్తుపదార్థాలకు, పేకాటకు యువత దూరంగా ఉండాలని సూచించారు.
కృష్ణా: గన్నవరం ఎస్ఎం కళ్యాణ మండపంలో హజ్ యాత్రికులకు అందుతున్న సదుపాయాల గురించి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హజ్ కమిటీ సభ్యులను శుక్రవారం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన నిర్వహిస్తున్న హజ్ యాత్రలో భాగంగా యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
CTR: భారత జనగణన-2027లో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 30 వరకు స్వయం గణన, మే 1 నుంచి 30 వరకు ఇంటింటి గణన జరుగుతుందని జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. జనగణన సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు, బ్యాంక్ వివరాలు అడగరని స్పష్టం చేస్తూ, అలాంటి వివరాలు కోరితే ఇవ్వవద్దని ప్రజలకు హెచ్చరించారు.
ATP: గుంతకల్లు DLDOగా పనిచేస్తున్న పి.విజయలక్ష్మి పదోన్నతి పొంది, ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO)గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే శుక్రవారం ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారని జారీ చేసిన ఆదేశాలలో పేర్కొన్నారు.
సత్యసాయి: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్షాల తీరును మంత్రి సత్యకుమార్ యాదవ్ ‘ప్రజాస్వామ్యానికి చీకటి రోజు’గా అభివర్ణించారు. మహిళల హక్కుల గురించి మాట్లాడే కాంగ్రెస్ కూటమి, బిల్లు విషయంలో ద్వంద్వ నీతి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. దేశ మహిళలకు జరిగిన ఈ ద్రోహాన్ని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.
PLD: మండలంలోని మంచికల్లు గ్రామంలో శుక్రవారం జిల్లా పరిషత్ పాఠశాల టీచర్లు, బాలబాలికలు పురవీధుల్లో బడి బాట ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా హెచ్ఎం షీలార్ అహ్మద్ మాట్లాడుతూ.. ఆదర్శ పాఠశాలలు, ఇంగ్లీషు మీడియం బోధన గురించి తల్లిదండ్రులకు తెలిపారు. విద్యాబుద్దులే కాకుండా నైతిక విలువలతో కూడిన విద్య అందిస్తామన్నారు.
SKLM: పాతపట్నంలో నిర్వహించిన కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్య సేవలందించడంలో పారామెడిక్స్ పాత్ర కీలకం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందించడంలో పారామెడిక్స్ సేవలు ఎంతో అవసరమని తెలిపారు.
AKP: నర్సీపట్నంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులతో తహసీల్దార్ లోకవరపు రామారావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్లు నమోదు ప్రక్రియలో రాజకీయ పార్టీ నాయకుల సహకరించాలని సూచించారు. ఓట్లు చేర్పులు, తొలగింపు తదితరు వాటిపై పార్టీ నాయకులు పరిశీలించుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉంటుందని తెలిపారు.
ఏలూరు జిల్లా వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కోట దిబ్బలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాటి నుంచి బయట పడేందుకు చేపట్టవలసిన చర్యలను వారికి వివరించారు. ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు.
KRNL: జిల్లాలో 43 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతున్న తీవ్ర ఎండల మధ్య పాఠశాలలు నిర్వహించడం విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదకరమని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి బి. మహేంద్ర బాబు అన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు గోవర్ధన్, పుల్లయ్య, దశరథ్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
E.G: భవన నిర్మాణ కార్మికులు వెంటనే కార్మిక సంక్షేమ బోర్డులో నమోదు చేసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని ఐఎఫ్టీయూ ఉమ్మడి తూ.గో జిల్లా సహాయ కార్యదర్శి బి. సిద్ధూ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 1, 2026 నుంచి భవన ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ పథకాలను తిరిగి అమల్లోకి తీసుకువచ్చిందన్నారు.
సత్యసాయి: కార్లను అద్దెకు తీసుకుని యజమానులను మోసం చేస్తున్న అన్నవరం గౌతం రాజును నల్లమాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు యజమానుల నుంచి వాహనాలు తీసుకుని, వారికి తెలియకుండా ఇతరుల వద్ద కుదువ పెట్టి భారీగా నగదు వసూలు చేసేవాడు. బాధితుల ఫిర్యాదుతో ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు.
ATP: గుంతకల్లు శివారులోని రిజర్వాయర్ వద్ద శుక్రవారం మున్సిపాలిటీ అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. రిజర్వాయర్ వద్ద ప్రమాద హెచ్చురిక బోర్డులను ఏర్పాటు చేశారు. మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో శ్రీనివాసులు మాట్లాడుతూ.. వేసవి కాలం దృష్ట్యా పిల్లలను రిజర్వాయర్ల వద్దకు పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు. రిజర్వాయర్‌లోని మోటార్ల పనితీరును పరిశీలించారు.
ATP: గుంతకల్లు శివారులోని రిజర్వాయర్ వద్ద శుక్రవారం మున్సిపాలిటీ అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. రిజర్వాయర్ వద్ద ప్రమాద హెచ్చురిక బోర్డులను ఏర్పాటు చేశారు. మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో శ్రీనివాసులు మాట్లాడుతూ.. వేసవి కాలం దృష్ట్యా పిల్లలను రిజర్వాయర్ల వద్దకు పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు. రిజర్వాయర్‌లోని మోటార్ల పనితీరును పరిశీలించారు.
GNTR: అగ్నిమాపక వారోత్సవాలు 4వ రోజు తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని వెస్ట్‌బెర్రీ స్కూల్‌తో పాటు రవి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హైస్కూల్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గ్యాస్, ఎలక్ట్రికల్ ఫైర్లు, కేర్లెస్ స్మోకింగ్ ప్రమాదాలపై డెమోలు నిర్వహించారు. విద్యార్థులకు మాక్ డ్రిల్ ద్వారా అగ్నిప్రమాద నివారణపై అవగాహన కల్పించారు.