• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

డిగ్రీ ప్రథమ సెమిస్టర్ ఫలితాల విడుదల

ATP: అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల డిగ్రీ మొదటి ఏడాది ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ప్రిన్సిపాల్ ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, ప్రిన్సిపాల్ పద్మశ్రీ ఫలితాలను ప్రకటించారు. మొత్తం 1,447 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 672 మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు ముగిసిన రెండు నెలల్లోపే ఫలితాలు విడుదలయ్యాయి.

April 22, 2026 / 09:27 AM IST

మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ

ప్రకాశం: జరుగుమల్లి మండలం వావిలేటిపాడు వద్ద మంగళవారం రాత్రి చాతుకుపాడు గ్రామానికి చెందిన శిరోమణి అనే మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బంగారు గొలుసు చోరీ చేశారు. వ్యక్తిగత పనులపై మహిళ ఒంగోలు వెళ్లి వస్తుండగా మార్గం మధ్యలో దొంగలు తన బంగారు గొలుసు చోరీ చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

April 22, 2026 / 09:13 AM IST

బీసీ గళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: జగన్

KDP: కూటమి ప్రభుత్వం బీసీలకు చేసిన అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈనెల 26న అనంతపురం లలిత కళా పరిషత్లో నిర్వహించనున్న బీసీ గళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. గ్రామస్థాయి వరకు వెళ్లి బీసీల సమస్యలపై చైతన్యం కల్పించాలని జగన్ సూచించారు.

April 22, 2026 / 09:10 AM IST

బస్సు షెల్టర్ నిర్మాణం చేపట్టాలి

PPM: ఖడ్గవలస కూడలిలో బస్సు షెల్టరు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ సరైన విశ్రాంతి భవనం లేకపోవడంతో పార్వతీపురం, పాలకొండ, కురుపాం గిరి జన మండలాలు, ఒడిశా ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల కోసం వైకూడలి వద్ద దుకాణాల ముందు, రోడ్డుపై నిలబ డాల్సి వస్తోంది. ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో బస్సు షెల్టరు నిర్మాణానికి తమవంతు కృషి చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.

April 22, 2026 / 09:05 AM IST

లైన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ రీజనల్ ఛైర్మన్‌గా పేరిచర్ల

పశ్చిమ గోదావరి జిల్లా లైన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ రీజనల్ ఛైర్మన్‌‌గా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన పేరిచర్ల మురళీ కృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం వాకర్స్ క్లబ్‌లో వివరాలు వెల్లడించారు. గతకొన్నేళ్లుగా లైన్స్ క్లబ్, డైమండ్ క్లబ్, పేరిచర్ల ఫౌండేషన్ ద్వారా చేసిన వివిధ సేవలకు గాను తనకు పదవి ఇచ్చినట్లు నియామక పత్రాన్ని విడుదల చేశారు.

April 22, 2026 / 09:05 AM IST

వైసీపీ ఇన్‌ఛార్జ్‌కు నోటీసులు

SKLM: వైకాపా టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌కు పోలీసులు మంగళవారం నోటీసులు అందజేశారు. పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉన్నప్పటికీ ముందస్తు అనుమతి లేకుండా ఈ నెల 9న పార్టీ శ్రేణులతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టిన ఘటనపై పోలీసులు వివరణ కోరారు. ఎస్సై రాము స్థానిక పార్టీ కార్యాలయంలో తిలక్‌కు నోటీసులు ఇచ్చారు.

April 22, 2026 / 09:03 AM IST

జీవీఎంసీ వార్డుల పునర్విభజనపై హైకోర్టులో సవాలు

VSP: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజనను నిలిపివేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. జనగణన పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియను అమలు చేయవద్దని పిటీషనర్లు కోరారు. వారి తరపున సీనియర్ న్యాయవాదులు కేఎస్ మూర్తి, జీఏల్ నరసింహరెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం సమయం కోరడంతో కోర్టు విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణ కీలకంగా మారింది.

April 22, 2026 / 09:03 AM IST

ఆ గ్రామ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

బాపట్ల: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామంతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుభవార్త చెప్పారు. గ్రామంలో దాదాపుగా 11 ఎకరాలలో 132 కేవీ స‌బ్ స్టేష‌న్ నిర్మాణం చేపట్టామని ఆయన వెల్లడించారు. నిర్మాణ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. దీంతో మండలంలోని రైతులకు విద్యుత్ బాధలు తీరునున్నాయి.

April 22, 2026 / 09:03 AM IST

‘టీచర్ల సమస్యలు పరిష్కరించాలి’

CTR: దీర్ఘకాలంగా టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని PRTU ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టరేట్ సమీపంలో నిరసన వ్యక్తం చేశారు. పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని నాయకులు కోరారు. పెండింగ్ డీఏలను చెల్లించాలన్నారు. టెట్ పరీక్ష రద్దు చేయాలని, జడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలను కలెక్టర్ పరిధిలో చేయాలన్నారు. అనంతరం డీఆర్వో మోహన్‌కు వినతిపత్రం అందించారు.

April 22, 2026 / 08:53 AM IST

AKNU@20 ఆకారంలో వెరైటీ థీమ్స్‌లతో విషెస్

E.G: రాజమండ్రి నన్నయ విశ్వవిద్యాలయం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం 20 రకాల థీమ్స్‌లతో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అధ్యాపకులు, సిబ్బంది కన్‌వెన్షన్ సెంటర్ వద్ద AKNU@20 ఆకారంలో నిలబడి శుభాకాంక్షలు తెలిపారు. చాళుక్య ద్వారం నుంచి విద్యార్థులు కోలాటాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

April 22, 2026 / 08:45 AM IST

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ

VZM: జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెర్లాం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నిర్వహిస్తున్న రికార్డులను, కార్యాలయ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయ పరిధిలో ఆదాయం తక్కువగా ఉండడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఆదాయం పెరిగేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సబ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.

April 22, 2026 / 08:41 AM IST

చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ RTC జోనల్ ఛైర్మన్

అన్నమయ్య: నందలూరు మండల కేంద్రంలోని బస్టాండ్‌లో జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని మాజీ RTC జోనల్ ఛైర్మన్ యెద్దల సుబ్బరాయుడు ప్రారంభించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు, బాటసారుల దాహార్తి తీర్చేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

April 22, 2026 / 08:40 AM IST

30న అరుణాచలానికి ప్రత్యేక బస్సులు

KDP: ఈ నెల 30న అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు RTC RM గోపాల్ రెడ్డి తెలిపారు. ఒక్క రాజంపేట డిపో మినహా అన్ని డిపోల నుంచి ఒక్కో సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ఏర్పాటు చేశామన్నారు. కడప నుంచి రూ.1044, బద్వేలు రూ.1282, మైదుకూరు రూ.1201, ప్రొద్దుటూరు రూ.1273, పులి వెందుల రూ.1242, జమ్మలమడుగు రూ.1238 చొప్పున టిక్కెట్ల ధరలను నిర్ణయించామన్నారు.

April 22, 2026 / 08:27 AM IST

రేప్ కేసులో యువకులు అరెస్ట్

TPT: తిరుపతి జిల్లాలో జరిగిన రేప్ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ తిమ్మయ్య వివరాల మేరకు.. BN కండ్రిగ మండలానికి చెందిన మహిళ(34) ఈనెల 16న భర్తతో గొడవపడి బయటకు వచ్చేసింది. రాత్రి వేళ నడిచి వెళ్తుండగా వీఎస్ పురానికి చెందిన జస్వంత్, సిద్ధార్థ బైకుపై ఆమెను వెంబడించారు. తర్వాత పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.

April 22, 2026 / 08:26 AM IST

జిల్లాలో చీనీ ధరలకు రెక్కలు

ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో చీనీ ధరలు భారీగా పెరిగాయి. ఈ నెల మొదటి వారంలో టన్ను ధర రూ.23 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.40 వేలకు చేరింది. తోటల వద్దే వ్యాపారులు టన్ను రూ.50 వేలకు కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్‌కు కాయల రాక తగ్గింది. మంగళవారం కేవలం 525 టన్నుల దిగుమతి మాత్రమే జరిగినట్లు ఇన్‌ఛార్జ్ కార్యదర్శి రాఘవేంద్రకుమార్ తెలిపారు.

April 22, 2026 / 08:24 AM IST